6, నవంబర్ 2010, శనివారం

వేరేవి..... ఉండచ్చు.... !!

జీవితం లో alternatives చాలా ముఖ్యం ... !!!

నాకు ఒక సంవత్సరం క్రితం దాకా.. ఏదో స్కూల్ కి కొత్తగా వెళ్ళే చిన్న పిల్లలు chalk pieces తినట్టు... నాకు కూడా తినాలనిపించేది.. ఎంతంటే.. ఏదో మందుకి సిగార్ కి ADDICT అయిన వాళ్ళు రోజుకి ఒకటి తాగకపోతే.. ఉండలేము అనేట్టుగా.....

మా ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు అప్పట్లో కానీ నేను మానుకోలేదు అయిదు నెలలదాకా... calcium tablets ,ఇవీ అవీ.. చాలా ఇచ్చింది మా అమ్మ అయితే....

"చాలా ఇష్టమయినవాటిని మనకు ఇష్టమయినవాళ్ళ కోసమే వదులు కోగలుగుతాము మనం...." ఎలాగో కష్టపడి.. బాబాపేరు మీద మానేసాను.... కానీ టైం పట్టింది... బట్ chalk తినాలనిపిస్తే.. ఇంకా ఏది అయినా తింటునాను. మెల్లగా మొత్తం అలవాటు పోయింది......... :-)

ఒకటి అయితే అర్ధం అయింది..ఇష్టం అయినదానిని వదులు కోగాలిగాం అంటే.. దానికి alternate దొరికినప్పుడు మాత్రమే మన వల్ల ... అవుతుంది ఏమో...!!!

లైఫ్ లో మనుషుల విషయం లో అయినా ఇంతే .. ఒకప్పుడు చాలా ఆలోచించిన వాళ్ళ గురించి మనం ఇప్పుడు ఆలోచించడం మానేసి ఉండచ్చు .. ఎందుకు అంటే ఆస్థానాన్ని ఇంకొకళ్ళు పూర్తి చేసి ఉండచ్చు............ ;-)

4 కామెంట్‌లు: