8, మార్చి 2012, గురువారం

ఇదీ సంగతి :)

హోలీ  ఎలా మొదలు అయ్యిందో అన్న దాని మీద చాలా స్టోరీస్ ఉన్నాయి ... దానిలో ఒకటి ఏంటి అంటే... 


కృష్ణుడు కన్నా రాధా తెల్లగా ఉంటుంది అనీ.. కృష్ణుడు ఎప్పుడూ వాళ్ళ అమ్మ దగ్గర ఉడుక్కునే వాదంత ... ఎందుకు ఇలా ఒకరు  ఒక లాగా ఇంకొకకరు ఇంకో లాగా ఉంటారు అని.. :(


అప్పుడు యశోద  ఏమో.. కన్నయ్యా నువ్వు   పుట్టినప్పుడు ఇంకా అందం గా ఉండే వాడివి.. కానీ చిన్నప్పుడు ఒక రాక్షసి ఇచ్చిన విషం నిన్ను చంపలేకపోయింది కానీ... ఆ విషం వంటిలో ఉండటం వల్ల నువ్వు నీల  మేఘ శ్యాముడివి అయ్యావు అని.. 


కానీ కృష్ణుడు ఆ  సమాధానం తో అసలు ఊరుకునే వాడు కాదంట... :) అప్పుడు వాళ్ళ అమ్మ సరే... నువ్వు కూడా  రాధని నీకు ఇష్టమైన రంగుల్లో  తడిపేసి తన రంగు మార్చుకో అనిందంట... అప్పటి నుండి  ఈ హోలీ మొదలు అయ్యింది అంటారు... :)


చూడండి.. మనకి నచ్చని విషయాలు చూసి ఎప్పుడూ బాధ పడకూడదు..ఏదో ఒకటి చేసి permanent  గా కాకపోయినా atleast   temporary  గా అయినా  మనకు కావాల్సి నట్టు మనం మార్చుకోవాలి :)) లైఫ్  నీ colorful   గా చేసుకోవాలి .. !!!


హ్యాపీ హోలీ :))

4 కామెంట్‌లు: