9, ఏప్రిల్ 2014, బుధవారం

దేవుడికి పేరు గుర్తు తెచ్చుకునే పని తగ్గించటానికి ఏమో :D

శ్రీ రామ నవమి  రోజు ఎలాగైన  వర్షం పడుతుంది  అని  మా అమ్మమ్మ  అనేది , పొద్దున్న  11 గంటలకి  (అంటే మరీ పొద్దున్న కాదు లే   :D ) హైదరాబాద్  గూగుల్  ఆఫీసు  opposite లో  ఒక సీత రామ  ఆంజనేయ స్వామి  గుడి ఉంటుంది , నేను పొద్దున్న  వెళ్తే జనాలు ఉంటారని 11 గంటలకి వెళ్లాను, కానీ అక్కడ కళ్యాణం  12 ఇంటికి మొదలవుతుంది  అంట .. నేను  వెళ్ళే టైం  కి  కొత్తగూడ  నుండి  hitech city  దాకా  ఉంది లైన్ ... మొత్తం హైదరాబాద్ లో ఉన్న  సాఫ్ట్వేర్ వాళ్ళందరూ తమ  తామ id  కార్డ్స్  వేసుకుని  (దేవుడికి పేరు గుర్తు తెచ్చుకునే  పని తగ్గించటానికి ఏమో  :D )   దర్శనం కోసం  ఉన్నారు

ఇలా  ఇంక  దర్శనం కోసమే ఉంటే నా  పనులు అవ్వవని దూరం నుండి దణ్ణం పెట్టుకుని వచ్చేసాను ... కానీ దేవుడికి నేను  అంత  దూరం  నుండి  వెళ్ళిపోవడం  నచ్చలేదనుకుంటా :D  సరిగ్గా  ఒంటి  గంటకు లంచ్ చేస్దామని అని కిందకు  రాగానే ,నా  ఫ్రెండ్ వచ్చి  రా  ఎదురుగానే  గుడి ఉంది  కదా ,ఒకసారి  వెళ్దాం  అని , నేను  ఏమి చెప్పకు పోయినా  తీసుకుని పోయారు



ఈసారి కొంచెం రష్ తగ్గింది ... బయటకు రాగానే మా అమ్మమ్మ  మాటలు  గుర్తొచ్చాయి "శ్రీ రామ నవమి  రోజు ఎలాగయినా   వర్షం పడుతుంది  "  ఇంచు మించు  40 డిగ్రీ  ఉంది  బయట  నాకైతే  ఆ  ఎండ  తగల గానే  అప్పుడే  తల నొప్పి వచ్చినట్టు  అనిపించింది , మొత్తానికి దర్శనం  అయ్యింది , చాలా మంది కేవలం  అక్కడ ఈ రోజున  పానకం ,వడ పప్పు  తిందాం అని  గుడి కి  వచ్చిన  వాళ్ళే , నా నార్త్ ఇండియన్ ఫ్రెండ్ కి  పానకం అంటే ఏంటో అర్ధం అయ్యేలా చెప్పే సరికి నా గొంతు  ఆరిపోయి నాకు కూడా పానకం తాగాలనిపించింది  :) (నేను బెల్లం తినను ,మిరియాలు అస్సలు పడవు  అందుకనే  టేస్ట్ కి తప్ప  పానకం  అంటే అంత ఇష్టం  ఏమి లేదు )

ఆ  పానకం గుడికి  కిలో మీటర్ దూరం  లో పెట్టాడు , అది  తప్ప దొరికిందే ఛాన్స్ మళ్లీ వీళ్లెప్పుడు గుడికి వచ్చి ప్రసాదం  కొనుకుంటారు  అనుకున్నారేమో ,అన్నిటికీ ఒక  price పెట్టి అమ్మేస్తున్నారు  :)

ఆ  హడావిడి నుండి  బయటికి వచ్చి ,పని  చేసుకుని సాయంత్రం 5 కి  కింద ఉన్న  బరిస్టా  కి  వెళ్దాం అని  దిగగానే , ఒక్కసారిగా  ఆకాశమంతా  మబ్బుగా  అనిపించింది ,చల్లగా  గాలి  తగులుతుంటే  మధ్యాహ్నం అంత  ఎండ  తర్వాత భలే  అనిపించింది ... రాత్రి చినుకులు కూడా  పడినట్టున్నాయి  :) ఇప్పటికే  climate  అలానే ఉంది .. !!!

చాలా  రోజుల  కిందటి వరకు  రాముడు సీతను  అంత కష్ట పెట్టాడు  ,అడవులలో  వదిలేసాడు  ,మరి  అలాంటిది రాముడు లాంటి భర్త ఎందుకు రావాలి అంటారు  అనుకునే  దానిని , కానీ  ఆలోచిస్తే  రాముడు  సీత  దగ్గర  లేకపోయినా  అన్ని  సంవత్సరాలు సీత  ను  తప్ప ఇంకో అమ్మాయి గురించి ఆలోచించలేదు , అలా ఎంత మంది అబ్బాయిలు  ఉంటారు , ఉన్నన్ని రోజులు చాలా  ఇష్టం అని చెప్పి , తర్వాత గొడవలు వస్తే  వేరే పెళ్ళిళ్ళు చేసుకుని జరిగింది మర్చిపోయి ,అసలు అలాంటి వాళ్ళే  తెలియనట్టు ఉంటున్నారు , మనకే పెళ్ళిళ్ళు  చేసుకోమని మన  అమ్మ  నాన్నలు ఇంత  pressure  పెడితే ,రాజు  అయిన రాముడికి  ఎంత  ఉండేదంటారు , అయినా కూడా  బంగారు సీత పెట్టుకున్నదే కానీ.. ఇంకో  పెళ్లి  చేసుకోలేదు  :)  ఏ  అమ్మయికయినా ఇంత  ఇష్ట  పడే  అబ్బాయి  కన్నా ఏం  కావాలి  :)

అదీ  సంగతి సమాచారం  :)