ఏంటో చిన్నప్పుడు స్కూల్ కెళ్ళే మొదటి రోజు కొత్త బట్టలు,కొత్త షూస్ ,కొత్త బ్యాగు ,కొత్త పుస్తకాలు , ఇంకా చాలా గుర్తొస్తున్నాయి కొత్త కొత్తవి :D కానీ ఇంక మీరు కొత్త బ్లాగ్ లో కూడా నీ సోది ఏంటి నిఖిత పాప అంటారని ఆపేస్తున్నా :D :D
ఏంటో ఎంత పెద్ద అయినా ఈ కొత్త పిచ్చ పోలేదు :)
ఇక నుంచి నా కొత్త రాతలు ,గీతలు ( అంటే for suppose future లో ఒకవేళ బుద్ధి పుట్టి , కలర్ పెన్సిల్స్ colorful గా అనిపించి , గీసే సాహసం చేస్తే ............ !!! :D ) అరే మీరు కంగారు పడకండి " చేస్తే ..... " అన్నా , ఓహ్ ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది అప్పుడు నా బ్రష్ నేమ్ ఏం పెట్టుకోవాలి ? పికాసా లాగా నా పేరుకి కొంచెం కలిసేలా నికాసా ,చకాసా .. తూచ్ ఏడ్చి నట్టు ఉన్నాయి :( సరేలే ఇది మళ్లీ మాట్లాడుకుందాము
ఇందుకే అంటారు , మనం లేని సమస్యలు సగం ఊహించుకుని 70mm లో 5D లో చూసేసి బాధ పడతాం అని ... !
సంగతి ఏంటి అంటే తర్వాత నుండి www.chandrasenaa.blogspot.in లో కూడా బ్లాగ్ పోస్ట్స్ రాస్తాను ...
ఇందాక 5D అంటే గుర్తొచ్చింది , ఇక్కడ Hyderabad లో kukatpally దగ్గర మంజీరా మాల్ అని ఒకటి కొత్తగా కట్టారు , అక్కడ 7D ధియేటర్ కడుతున్నారు అంట ,అంటే ఒకవేళ horror మూవీ చూస్తే నిజంగా దెయ్యం పీక పట్టు కున్న ఫీలింగ్ వస్తుందా అమ్మయ్యో ... :( :(
Lodha అపార్ట్మెంట్స్ ఉన్న సర్కిల్ లో కూడా ఇంకో మాల్ , ఇంకా మల్టీప్లెక్స్ కడుతున్నారు ... ఏంటో ఎన్ని ఇల్లు ఉన్నా రెంట్ కి ఒక్కటీ ఖాళీగా ఉండవు , ఎన్ని సినిమా హాళ్ళు ఉన్నా ఫస్ట్ డే టికెట్స్ దొరకవు :(
నేను వన్ మూవీ చూసానోచ్చ్ .. actually ఫస్ట్ డే నే చూసేసాను (ఒక్కోసారి ,జన్మకోసారి ఇలాంటి సాహసాలు) , భలే ఉన్నాడు మహేశ్ బాబు :D , స్టోరీ బావుంది , కొత్త గా (unexpected ) , అందుకే మన వాళ్ళు అస్సలు రిసీవ్ చేసుకోలేదు (ఇది expected ) :(
Screenplay బావుంది , "ప్రేమ కన్నా భయం గొప్పది సమీర " అని ఒక డైలాగ్ సూపర్ ఉంది , ఆ సినిమా టైటిల్స్ వేసి నప్పుడు , ఏదో ఒక పాత music playing instrument చూపించాడు , చాలా interesting గా ఉంది
కానీ మెల్లగా క్రౌడ్ పెరుగుతున్నట్టు ఉన్నారు , పక్కన దిల్ రాజు పక్కా mass entertainer , same ఓల్డ్ అయిదు పాటలు ,ఆరు కొట్లాటలు సినిమా స్కోప్ వేసి మంచి కలెక్షన్స్ తెచ్చుకుంటున్నాడు ... !!!
మన తెలుగు సినిమాల స్టాండర్డ్ పెరగదు అంటాము , పెరిగితే దిమాగ్ damage , పైసా వేస్ట్ అని negative publicity ఫ్రీ గా ఇచ్చేస్తాము , advice ఏ కదా గురూ ,ఇచ్చేస్తే పోయే.... మన నోటి దురద , పక్కోడి కి future మీద ఉన్న ఉత్సాహం రెండూ తీరిపోతాయి , అంటే ఇక్కడ future అని ఎందుకన్నా అంటే , కొంత మంది రివ్యూ బాగా చెప్తే చూస్తారు , ఒకవిధంగా వాడి జీవితం లో ఒక మూడు గంటలు ఏం చెయ్యబోతున్నాడు అనేది మీ మాట మీద ఆధార పడి ఉంటుంది :D :D
ఇప్పుడు Hyderabad లో ఎన్ని సినిమాలు అయినా చూడచ్చు , సిటీ సగం ఖాళీ .... !!
నేను మా అమ్మమ్మ ఊరు వెళ్లి రెండేళ్ళు అయ్యింది :( ఈసారి కూడా వెళ్ళటం కుదరలేదు , కానీ అక్కడ ఉన్న మా మావయ్యలు మాత్రం నాకోసం జంతికలు , మా తాత గారి కోసం అరిసెలు చేసి పంపుతారు :) నేను అరిసెలు తినను , ఆ మాటకొస్తే తీపివి ఏవీ పెద్దగా తినను ... దీన్లో హైట్స్ ఏంటంటే , చిన్నప్పుడు బొబ్బట్లు చేస్తే , నేను లోపల పూర్ణం తీయించి వింత వింత shape లలో చేయించుకుని తినే దానిని , మళ్లీ దానికి ఉత్తట్టు అని ఒక పేరు పెట్టుకుని మరీ :D , ప్రపంచం లో బొబ్బట్టు తినని తింగరి బుచ్చి నువ్వే అని మా వాళ్ళు అనేవాళ్ళు అది వేరే సంగతి అనుకోండి :)
ఈ సంక్రాంతి టైం లో నువ్వులు తింటే మంచిది అనుకుంటా , ఎందుకంటే ఆంధ్రా లో అరిసెలు చేస్కుంటే , తెలంగాణ వాళ్ళు నువ్వులు చిమిలి ఉండలుగా చేసి పంచి పెడతారు. ఈ సంక్రాంతి టైం లో నువ్వులు వాడితే ఏదయినా కీడు ఉంటే తొలగిస్తుందని చెప్తారు, మా మావయ్య వాళ్ళు వేట వేసే వాళ్ళు , అంటే కోడిని కానీ మేకను కానీ బలివ్వటం , ఎందుకలాగా పాపం కదా అంటే ... మా అమ్మమ్మా చెప్పేది... " ఈ పెద్ద పండగ కాలం అంత మంచిది కాదు , ఎవరో ఒకరు ఎక్కువగా చనిపోతూ ఉంటారు , అందుకని ఇంటి నుండి ఇలా కోడి /మేక ని బలి ఇచ్చి రక్తం చిందిస్తారు " అని . కేరళ లో జల్లి కట్టు కూడా ఇందుకే ఆడతారు అంట ... !!!
ఏంటో ... మేమైతే పూజ అయ్యే దాకా ఆ పక్క కూడా వెళ్ళే వాళ్ళం కాదు , ...!!
ఇది పక్కన పెడితే , భలే ఉంటది కదా సంక్రాంతి season ,చిన్నప్పుడు ఇంకా సూపర్ ఎందుకంటే holidays కాబట్టి :D , భీమవరం దగ్గర అయితే కోడి పందాలు , ఎడ్ల పందాలు .. Hyderabad లో వాళ్లకి అక్కడ ఫస్ట్ టైం కొంచెం కొత్తగా ఉంటది (నాకు అలానే ఉండేది ) , ఇవన్నీ చూసి కాదు , kites కనిపించవు :( Hyderabad లో సంక్రాంతి అంటేనే kites ... డీల్ ,మాంజా , చరక్ ,సఫా :D ధూల్ పేట్ లో అయితే ఎన్ని షాప్స్ ఉంటాయో,చాలా పెద్ద బిజినెస్ ఈ టైం లో ... !!!
కానీ ఒక విధంగా చూస్తే పండగలు లేకపోతే , ఇప్పుడు ఉన్న కొద్ది affections కూడా మన మధ్య ఉండవేమో అనిపిస్తుంది .. !! ఇప్పుడు చూడండి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్లకపోయినా అందరూ ఎలా గుర్తోస్తున్నారో , అందరికీ అలానే ఉంటుంది కదా.... atleast వీటి పేరు చెప్పుకుని అయినా అందరినీ తలుచుకోవచ్చు , కలుసుకోవచ్చు ... :)