8, సెప్టెంబర్ 2014, సోమవారం

మేము ఆ నెక్స్ట్ రోజు ఎంత సేవింగ్ చేసాం అంటే

చాలా  రోజుల  తర్వాత హైదరాబాద్  వెళ్లి  నప్పుడు  ఎంత  ఆనందం  వేసిందో .. ఉన్న వారం  రోజులు  వర్షం  పడుతూనే ఉండటం  అంత  చిరాకు  వేసింది  :(

సింగపూర్  చేస్తాము  సింగరాయి  కొండ  చేస్తాము,అంటారు  కానీ  అదే  సింగపూర్  లో   రోజూ  పెద్ద  పెద్ద  వర్షాలు  పడినా  ఒక  చుక్క  నీళ్ళు  ఉండవ్ , మన  హైదరాబాద్  కూడా  అంతే  అనుకోండి .. చుక్క  నీళ్ళు  కాదు  కదా  ముందు  నెల  వేసిన  రోడ్లు  కూడా  ఉండవ్  :P

వారం  రోజుల్లో  ఒకరోజు  eat  స్ట్రీట్  వెళ్లాను , ఇక్కడ  వచ్చిన  ప్రతి సారీ  నాకు  చిన్నప్పటి  మెమోరీస్  బోల్డు  గుర్తు  కొస్తాయి .. మధ్యాహ్నం   మూడు  వేలు  వదిలించుకుని  చేసిన  లంచ్  కంటే  సాయంత్రం  ఇక్కడ  నలబయ్యి  రూపాయిల స్ప్రింగ్  పొటాటో , ఇరవయ్యి  రూపాయిల  మొక్క  జొన్న  కంకి  తో  నెక్లెస్  రోడ్  మీద  తిరగడం  సూపర్  అనిపించింది  :)  

మేము  ఆ  నెక్స్ట్  రోజు  ఎంత  సేవింగ్  చేసాం అంటే  ఆ  స్ప్రింగ్  పొటాటో  బాంబూ  స్టిక్  ని  పనీర్   కబాబ్స్  కి  use  చేసాం  :D  స్టిక్  ఉంది  కదా  అని  కబాబ్  కి డబ్బులు  తగలేసి  మళ్లీ  సేవింగ్  ఏంటి  అంటారా  :D  ఉష్ ..  !!!

రభస  మూవీ  కూడా  చూసా  అనుకోండి .. ఎన్టీఆర్  బావున్నాడు :D  .. సినిమా / సినిమాలు  watever  పిచ్చ  బోరింగ్ ..పాపమ్  ఆ  డైరెక్టర్ రెండో  సారి  ఆయనతో  ఎన్టీఆర్   ఇంకో సినిమా  చెయ్యడని   భావించి రాసుకున్న  అన్ని  సినిమాలు  కలిపి  పడేసాడు  మన  తల  మీద  :(

ఇంతకీ  ఈ  మధ్యలో   నేను  సాధించిన  అతి   గొప్ప  పని  గురించి  రాయ  దలుచుకున్నా  :D గత  అక్టోబర్  నుండి  ఇలా  తినడం ,తిరగడం  తప్ప  ఏం  పని  లేకపోవడం  వల్ల ,తింటూ  కూర్చుంటే  కొండలు  కరుగుతాయో  లేదో  కానీ  వెయిట్  మాత్రం  బాగా  పెరుగుతుంది ...  :(  మళ్లీ  వెయిట్  లాస్ అంటే అదో  మహా  ప్రస్థానం  నా  ఫిట్నెస్  instructor  బుజ్జీ  ను  ఇలా  ఒక్కసారే  అన్నీ  మానేసి  తిని  కూర్చుంటే  కష్టం  అని  నాలుగు  తిట్టి , workouts  తో  పాటు  లో  కార్బ్  డైట్   ఫాలో  అవ్వు  అని  చెప్పాడు ... అతను  లో  కార్బ్స్  తిను  అంటే  నేను  ఇంకా  extreme  కి  వెళ్లి  " atkins  డైట్ " ప్రిఫర్  చేసాను .. రోజుకి  20gm  కార్బ్స్ ,మిగతాది  అంతా  ప్రోటీన్  ,fat , ... ఇది  మొదటి  రెండు  వారాలు  చెయ్యలిసిన  డైట్ ,తర్వాత  వేరే  వేరే  phases  లో  వేరే  వేరే  ఫుడ్ ..

నేను  ఈ  విధంగా ,గుడ్లు,చికెన్ ,సలాడ్స్  మీద  బతకగలను  అన్న  సంగతి  ఇప్పటి  దాకా  తెలియలేదు  :(  whatever  లాస్ట్  కి  సూపర్  వెయిట్  లాస్  అండ్  మళ్లీ  వర్కౌట్స్  వల్ల maintain  చెయ్యగలుగు  తున్నా ... నన్ను  చూసీ  inspire  అయిన  ఇద్దరు  ట్రై  చేసి  మిగ్రేన్  తెచ్చు  కున్నారు  :( :(

లో  కార్బ్   diets   atkins ,south బీచ్ అందరికీ సరి  పోవు , చాలా  complications  కూడా  ఉంటాయి , బట్  పని  చేస్తే  మాత్రం  చాలా  బాగా  పని  చేస్తాయి, అమ్మాయిల్లో  pear /hour గ్లాస్  కి  బెస్ట్  ... !!!

gym /jog   అలవాటు  చేసుకోవటం  మంచిదే  కానీ  ఇక్కడ  విషయం  ఏంటి  అంటే మీరు  వర్క్  అవుట్  అసలు  చెయ్యకపోయినా పర్వాలేదు  కానీ ,బాడీ  కి కష్ట  పడటం  అలవాటు  చేసి ,ఒకసారే  మానేస్తే ,మీరు  ఇంకా  వర్క్  అవుట్  చేస్తారేమో ,ఇంకా  ఎనర్జీ  కావాలని ఏమో  అని  బాడీ  calories  స్టోర్  చేస్తూ  ఉంటుంది , ఫలితం  జీన్స్  లో  ఐష్  నుండి  జాజ్బా  లో  ఐష్  అవుతారు  అన  మాట  :)

సరే   14 రోజులు "లో  కార్బ్"  ఫాలో  అవ్వాలి  అనుకునే  వాళ్లకి  sample  డైట్

మార్నింగ్  : ఎగ్స్ / ఒక  పెసరట్టు, కాఫీ ,టీ  షుగర్  లేకుండా ఎందుకంటే   1gm  షుగర్  = 5gm  కార్బ్
లంచ్  : చికెన్/ఫిష్ /మటన్  (ఎలాగయినా కానీ  వితౌట్  రైస్ /రోటి  ) , ఆలివ్  ఆయిల్  preferable , veg  అయితే  పనీర్ /tofu , or  ఏదయినా  కూర  (cabbage /బెండి /brinjal /బ్రోకోలి /కాలీఫ్లవర్ /టమాటో  అలాంటివి .. నో  carrot /beetroot )
డిన్నర్  : same  లంచ్  లా .. fruits  లో  షుగర్స్  ఉంటాయి  కాబట్టి  ప్రిఫర్  చెయ్యద్దు

పాలు  వద్దు ,cheese  ,yogurt  తినచ్చు ....

14 రోజుల  తర్వాత  రొజూ  రోటి /చిన్న  బౌల్  రైస్ / లో  షుగర్  fruits  ఆడ్  చెయ్యండి ,  ఫస్ట్  రెండు  రోజులు headache /fatigue  ఉంటాయి  కాబట్టి  వీకెండ్స్  సెలవు  ఉన్నప్పుడు  స్టార్ట్  చెయ్యండి ...  ఎక్కువ  అనిపిస్తే  వెంటనే  ఆపెయ్యండి  .. !!




1 కామెంట్‌: