28, సెప్టెంబర్ 2014, ఆదివారం

అవీ ఇవీ అన్నీ.......




ఈ కీర్తన  ఎన్ని  సార్లు  విన్నా    ...   అంతకు అంత  ప్రశాంతత పెరుగుతుంది అనిపిస్తుంది  నాకు  :)  చాలా  నెలల  కిందట ఒక పెళ్ళికి  వెళ్లి నప్పుడు , పెళ్లి కూతురు  చాలా  బాగా  పాడుతుందని  అందరూ  ఏదయినా   కీర్తన  పాడ మంటే  ఆ  పిల్ల ఈ  పాట పాడింది , నాకు  సగం  నుండి  వినడం  వల్ల  పాట  పల్లవి  తెలియలేదు  :( కానీ  భలే  నచ్చింది ...!!!

మొన్న  వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఒక  టీవీ  ఛానల్ వాళ్ళు  చూపిస్తూ బ్యాక్ గ్రౌండ్  లో  ఈ కీర్తన  ప్లే చేసారు .youtube  లో  వెతికితే  ,ఇది  అన్నమాచార్య  కీర్తన  అని  తెలిసింది .. ఇద్దరు  ముగ్గురి  వెర్షన్  విన్నా  కానీ  ఆ  అమ్మాయి  పాడినంత  బాగా  ఎవరిదీ  అనిపించలేదు  :(

ఈ  కీర్తన  పక్కన  పెడితే అన్ని  చోట్ల  ఇంకో  కీర్తన  ఏంటంటే  అదే  హాట్ టాపిక్ జయ  అమ్మ  పాపం  జైలు  కి  వెళ్ళింది ,65 ఏళ్ళు  వయసులో  నాలుగు  ఏళ్ళు  శిక్ష , అక్కడ  ఒకటి  అర్ధం  కాలేదు  నాకు ,66 కోట్ల  ఆస్తికి  100 కోట్లు  ఫైన్  ఏంటి ,అసలు  అంత  వైట్  మనీ తో  ఫైన్   ఎలా  కడతారు  :O  మళ్లీ  ఇంకో స్కాం   చెయ్యాలేమో  :D

ఒక  అమ్మ  బ్లాక్ మనీ  కేసు  లో  ,ఇంకో  తాత  2జి  స్కాం  లో  పోతే  మిగిలేది  మన పార్టీ  నే  అని  BJP  సూపర్ ఆనంద పడుతుంది అనుకుంటా  :)

వీకెండ్  హ్యాపీ  గా  మహేష్  బాబు  సినిమా  చూసుకుందాం అనుకుంటే అస్సలు  అలాంటి సాహసం  చెయ్యొద్దు  అని  చూసిన  వాళ్ళు  గీతా  బోధ  చేసారు :P

ఇంకేం చెయ్యాలో  చెయ్యాలో  తెలీక  youtube  లో  సినిమాలు ,tv  లో  సినిమాలు  చూస్తూ  ,ఎంత  entertainment పొందానో  తెలీదు కానీ   బోల్డు  విజ్ఞానం  మాత్రం  పొందాను  :P  అంటే  పాత  సినిమా  చూసిన  ప్రతి  సారీ   ఏదో  ఒక  కొత్త  సినిమా  సీన్  గుర్తు  వచ్చేది  :)  

కావాలంటే  ఇప్పుడు  కూడా "రామయ్య  వస్తావయ్య  " చూస్తున్నా ,దానిలో  రోహిణి  హత్తంగడి  ,'అప్డేట్  అవ్వండి ' అని  ఫ్రీక్వెంట్  గా  అంటుంది , ఆగడు   లో  మహేష్  డైలాగ్  ఇదే కదా  :P

post  కీర్తన  తో  స్టార్ట్  చేశా  కాని , ఒక  మంచి  ఇండియన్  రాపర్  వీడియో  ఆడ్  చేస్దాము  అనుకుంటున్నా  :) yo  yo  సింగ్  ది  కాదులే  భయ  పడకండి / తన  వీడియో  లో  సన్నీ  లియోన్  ని  గుర్తు  తెచ్చుకుని  ఇక్కడ  లేదని  నిరాశ  చెంద  కండి  :P 





   ఆ  చార్  బాటిల్  వోడ్కా  లో  రాప్  ఎక్కడ  ఉందో  ఇప్పటికీ  అర్ధం  కాదు నాకు ,తను  పిట్  బుల్ ,సన్నీ  ఏమో  జెన్నిఫర్  లోపెజ్  అని  మనం  అనుకోవాలేమో  :(  ఏదో  నాలుగు  మాటలు  ఫాస్ట్  గా అనేస్తే చాలేమో   రాప్  అయిపోతది అనుకుంటా  :)    ఆ  బేబీ  డాల్  సాంగ్  jlo  "dance  again " నుండి  కాపీ  చేసి  పడేసాడు  స్టెప్స్  అన్నీ....  :( :(

వసుధైక  కుటుంబం  అన్నారు  కదా .. సినిమాలు  అన్నీ  పాత  వాటి  నుండి  వచ్చినా ,పాటలు  అన్ని పక్క  కంట్రీ  నుండి  ఎత్తుకు  వచ్చినా ... అందరిదీ  ఒకే  కుటుంబం  సో  లైట్  తీసుకుని  నచ్చితే  విందాము ,లేకపోతే  మానేస్దాము :D  

హైదరాబాద్  లో  బతుకమ్మ  పండగ  అని  పది  కోట్లు  ఫండ్స్  ఇచ్చాడంట  KCR   , అక్కడ  govt   women   employees  కి  ఈ  దసరా  అన్నీ   రోజులూ   మధ్యాహ్నం 2 నుండి  వచ్చేయచ్చు  అంట :O  హాఫ్  డే  ఆఫీసు  అనమాట ... 

సంక్రాంతి పండగకి  మాత్రం  రెండు  రోజులు  మాత్రమే  సెలవు  ఇచ్చాడంటా  ,తెలంగాణా  వాళ్ళు  సంక్రాంతి  చేసుకుంటారా  ఎక్కడయినా  :P  అయినా  సూపర్  అబ్బా .. పోలీస్  లకి  ఇన్నోవాలు , గణేష్  లకి  హెలికాప్టర్  లో  పూల  వానలు ,ఆడ పడుచులకి  బతకమ్మలు ,సగం  రోజు  ఆఫీసు  లు , తప్పదు  లే  మరి  కిందటి  సారి  తెలంగాణ  తెచ్చాడని  వోట్ వేసారు , ఈసారి  ఇలాంటివి  ఏమైనా  చెయ్యక  పోతే  ఎట్టా :) :)  







14, సెప్టెంబర్ 2014, ఆదివారం

మొదటి ఆఫర్ లెటర్ స్టోరీ .... !!!

ఈరోజు నా  కజిన్  ఒక  అమ్మాయి  కాల్  చేసింది , తనకు  TCS  లో  జాబ్  వచ్చింది అని  ... అది  తన  మొదటి  జాబు  అవ్వటం  అందులోను  కొంచెం  లేట్  గా  రావటం  వల్ల  చాలా  హ్యాపీ  గా  ఉంది  పిల్ల  :)

నా  మొదటి  ఆఫర్  లెటర్  తీసుకుని  ఇప్పటికి  మూడు  ఏళ్ళు  దాటింది , ఈ  పిల్ల  తో  మాట్లాడిన  తర్వాత  ఆ  రోజులు  తలుచుకుంటే  భలే  నవ్వు  వచ్చింది :)

నిజంగా  మొదటి  ఆఫర్  లెటర్  ని  bible /గీత  కన్నా  మిన్నగా  భావించి  రోజుకి   ఒక  పది  సార్లు  అయినా  చూసుకుని  మురిసిపోతాము  :D  ఇంక  ఇంట్లో  వాళ్ళ  సంగతి  అయితే  చెప్ప  నక్కర్లే   .. !!



జాబు  వచ్చిందీ  అంటే , నాకు  తెలిసి  మనం  చేసిన  మొదటి  పని  షాపింగ్  :D  ఇంట్లో  వెయ్యి  జతలు  ఉన్నా , ఫార్మల్స్  లేవు /  టై  లేదు / బెల్ట్  లేదు  లాంటి  పిచ్చి  excuses  చెప్పి  మరీ ఏదో  ఒకటి   కొనుక్కుని  వస్తాము  :)

ఆ  టైం  లో  మన  ముందు  ఉండే  పెద్ద  పనులూ ,మిలియన్  డాలర్  questions ఏంటి  అంటే 

 ఇప్పుడు  ఏ  బ్యాంకు  లో  సాలరీ  ఎకౌంటు  ఓపెన్  చెయ్యాలి  :D " ఎవడి  క్రెడిట్  కార్డు  బావుంటుంది  ,  సంవత్సరానికి  50k స్పెండ్  చెయ్యకపోతే  తర్వాత  వెయ్యి  రూపాయిల  ఛార్జ్  ఉంది  అంటే , అమ్మో  50k  ఎలా  ఖర్చు  పెట్ట  గలుగుతాము  అనుకుంటాము  కానీ  , సీన్  తర్వాత  రివర్స్  అయ్యి  ఇంకో  కార్డు  ఎవడు  ఇస్తాడా  అని  ఆలోచించే  పరిస్థితి  ఉంటుంది  అని  అప్పటి  మన  చిన్ని  బుర్ర  కి  తెలియదు  :D  :D

నెల  కు  వచ్చే  జీతాన్ని  మెంటల్  గా  అన్నిటికీ  డివైడ్  చెయ్యటం  మొదలు  పెడతాము   :)





మనం  ఎప్పుడూ   పేరు  కూడా  వినని  మావయ్య , తాతయ్య   LIC  తీసుకో  నీకు  టాక్స్  తగ్గుతది  అని  చెప్పడం  మొదలు  పెడతారు  అక్కడికి  మనం  నెలకు  లక్ష  మించి  సంపాదించే  తట్టు  :D

ఫేక్   రెంటల్  అగ్రిమెంట్  కోసం  స్టాంప్  లు  కొనటం లాంటి  అలవాటు  లేని  పనులు  కూడా చెయ్యటం  మొదలు  పెడతాము

మొదటి  రోజు  కంపెనీ  ambience  చూసి  నిజంగానే  చాలా  excite  అవుతాము , మన  పేరెంట్స్  కి  ఇలాంటివి  తెలియక  పోతే  ఇంటికి  వచ్చి  చాలా  గొప్పగా  చెప్తాము , నా  ఆఫీసు  బిల్డింగ్  20 ఫ్లోర్  లు  , అంతా  ac నే , కాఫీ  కి  మెషిన్  లు  ఉంటాయి ,పడుకోవటానికి  wellness  రూం  లు  ఉంటాయి , జిమ్  లు  ఉంటాయి , ఇవి  ఉంటాయి  అవి  ఉంటాయి  అని  మన మాటల  ప్రవాహం  ఆపము, వాళ్ళు  కూడా  అంతే  ఆనందం  గా  వింటారు   :)

పైన   లైన్  రాస్తుంటే  ఈ  మధ్య  Tv  లో  చూసిన  airtel  ad  గుర్తొచ్చింది  :) దాన్లో  అమ్మాయి  తన  పేరెంట్స్  కి  వీడియో  కాల్  లో తన  కంపెనీ  accomodation  చూపిస్తూ  ఉంటుంది ... లింక్  పెడతాము  అని  youtube  లో  వెతికితే  కనిపించట్లే  :( :(

నేను  కూడా   ఒక  త్రీ  ఇయర్స్  బ్యాక్  మా  అమ్మ నాన్న  కి , నా  కంపెనీ   accomodation   ని  అలానే  చూపించాను  :)

ఇంక  మొదటి  నెల  పని  గురించి  చెప్పు  కోవాలి, అందరూ  8 గంటలు  పని  చేస్తే , మనం  పన్నెండు  గంటలు   పని  చేస్తాము  :P  కొత్త  మోజు  అంతే  లెండి ... !!



ఇంత  మహా  ప్రస్థానం  తర్వాత  మన  కొచ్చిన  మొదటి  జీతం  చూసి  నప్పుడు  వచ్చిన  ఆనందం  మన  లైఫ్  లో  ఎప్పటికీ  గుర్తుంటుంది  కాదంటారా  , తర్వాత  నెలకు  ఎన్ని  లక్షలు  వచ్చినా  ,మొదటి  జీతం  ,మొదటి  జీతమే :)

జాబు  లో  ఏం  నేర్చుకుని  ఉంటామో  తెలీదు  కానీ , మొదటి  pay slip  మాత్రం  మనకు  టాక్స్  calculations  నేర్పిస్తుంది , ప్రావిడెంట్  ఫండ్  అంటే  కంపెనీ  మనకు  చేతికి  ఇవ్వదు  అని  తెలుస్తుంది , మనం  ఇంటికి  వెళ్లి  ఈ  విషయం  చెప్తే , తర్వాత  నీకు  కట్  అయిన  దాని  కంటే  డబల్  ఇస్తారు  అంటే , అప్పుడు  ఎప్పుడో  ఎందుకు ,అదేదో  ఇప్పుడే  ఇస్తే  బావుండు  అని  అనిపిస్తుంది  :D





అదండీ   మొదటి  ఆఫర్  లెటర్  స్టోరీ .... !!!  హ్యాపీ  సండే :) :)

13, సెప్టెంబర్ 2014, శనివారం

చిన్నప్పటి చిన్ని భయాలు :)

పోస్ట్  రాస్దాము  అని  బ్లాగర్  ఓపెన్  చెయ్యగానే  మా  అక్క  కాల్  చెయ్యడం  తో  ఇది  పక్కన  పెట్టి ,దాని  కూతురు  జానవి  తో  మాట్లాడేసరికి  గొంతు  ఆరిపోయి  :P  నీళ్ళు  తాగుదాము  అనుకునే  సరికి  పొలమారింది  ... ఎవరో  బాగా  నన్ను  తిట్టుకుంటున్నారు / తలుచుకుంటున్నారు  అనుకుని  మళ్లీ  బ్లాగర్  ఓపెన్  చేసాను ...

ఈ   నీళ్ళు  తలుచుకుకోవటం /తిట్టుకోవడం  కాన్సెప్ట్  అలోచించి  నప్పుడు  కొంచెం  nostalgic  గా  అనిపించింది  ..  మన లో  చాలా  మంది   ఇళ్లల్లో    ఇలాంటివి  బోల్డు  నమ్మ కాలు  ఉండేవి/ఉంటాయి   కదా .. !!! కొన్ని  కాలం  తో  పాటు  మర్చిపోతాము , మరి కొన్ని  ఇలా  జీవితం  అంతా  గుర్తుంచుకు ఉంటాము ... 

కొన్ని  కొన్ని  మనం  మర్చిపోయినా  ఏదో  ఒక  సినిమాలో  చూపించినప్పుడు  నవ్వు  కొని  ఊరుకుంటా ము  (బొమ్మరిల్లు  లో  తల  తగిలితే  కొమ్ము  లోస్తాయి  అంటుంది  చూడండి  అలాంటివి  :) )

ఇప్పుడు  నాకు  గుర్తున్న  ఇంకొన్ని  ఇక్కడ  రాస్దాము  అనుకుంటున్నా  :)

1. రాత్రుళ్ళు  గోళ్ళు  తీసుకో  కూడదు , ఇంటికి  దెయ్యాలు  వచ్చేస్తాయి  తెలుసా  :D 

2. పొద్దున్నే  లేచి  చీపిరి  కట్ట  చూస్తే  ఆ  రోజంతా  మీకు  కష్టాలే  , అయినా  రాత్రి  తాగింది  ఎక్కు  వయ్యి  చీపిరి  ఉన్న  చోట  పడుకోవాలి కానీ  normal  గా  లేవగానే  చీపిరి  కట్ట  ఎలా కనిపిస్తుంది , నన్ను  అడిగితే  ఇక్కడ  తప్పు  పొద్దున్నే  నిద్ర  లేపి  మరీ  చీపిరి  కట్ట  చూపించే  వాళ్ళది  :D 

3. ఈసారి  మీకు  ఆవలింత  వస్తే  పెద్దగా  నోరు  తెరిచి  ఆవలించ కండి , ఈగలు  వెళ్తాయి  అని  కాదు , దెయ్యాలు  వెళ్తాయి :P 

4. ఎవరయినా  ఇద్దరు  ఒకేసారి  ఒకే  మాట  మాట్లాడితే  ఇంటికి  చుట్టాలు  వస్తారు  , కాకి  అరిచినా  ఇలానే  అంటారు కదా  

5. ఎవరి  కయినా  డబ్బులు  కానీ / తాళం  చెవులు  కానీ   ఎడమ  చేతితో  ఇస్తే  అవి  ఇంక పోయినట్టే  :p  ఈ  లెక్కన  నా  లాంటి  ఎడమ  చేతి  వాటం  వాళ్ళ  పరిస్థితి  ఏంటంటారు  :D 

6 జంట  అరటి  పళ్ళు  తింటే కవలలు  పుడతారు  , ట్విన్స్  కోసం  ట్రై చేసే  వాళ్లకు  సూపర్  షార్ట్  కట్  :P 

7. మీకు  ఈల  వెయ్యటం  వచ్చా  ?? సరే   ఒక  వేళ  ఇప్పుడు  మీకు  రాత్రి  అయితే  వెయ్యకండి , ఎందుకంటే  పాములు  వచ్చేస్తాయి  మీ  ఇంటికి , ఈలకి  పాముకి  ఏం  సంబంధం  ఓ  ఇప్పటికీ  అర్ధం  అవ్వట్లేదు  నాకు ,ఈల  కూడా  నాధ  స్వరం  లా  వేసేంత  talent  మనకు  ఉందంటారా  :P 

8 ముగ్గురు కలిసి  ఎక్కడికి వెళ్ళకూడదు ,  అందుకని  ఒక  రాయి  పట్టు  కుని  వెళ్ళాలి  :)

9. ఒక  రోజు  లేచి  అద్దం  లో  మీ  జుట్టు  లో  పొరపాటున  ఒక  తెల్ల  వెంట్రుక  కనిపిస్తే , వెళ్లి  గోద్రెజ్  కలర్  కొనుక్కోండి  అంతే  కానీ  ఒకటే  కదా  అని  పీకకండి , ఎందుకంటే  అలా  చేస్తే  తెల్లారే  సరికి  మీ  తల  కూడా  తెల్ల  గా  అయిపోతుంది  :P 

10 ఎక్కిళ్ళు   వస్తే  మిమ్మలిని  ఎవరో  తలుచుకుంటున్నారు 

11. నీలి  కళ్ళు  ఉన్న  వాళ్లకి  దెయ్యాలు  కనిపిస్తాయి  అంట  :P  పాపం  ఐశ్వర్య  రాయి  కి  ఇప్పటికి ఎన్ని  ఆత్మలు కనిపించి  ఉంటాయో  :P 

12. వర్షం  , ఎండా  వస్తే  ఇంద్ర  ధనుస్సు  వస్తది  ఏమో  తెలీదు  కాని ,ఎక్కడో  కుక్కకి  నక్కకి  పెళ్ళి  మాత్రం  ఎక్కడో పెళ్ళి  అవుతూ  ఉంటుంది  అని  తెలుసు  కోండి  :P 

13.  ఎవరికయినా  రెండు  సుడులు   ఉంటే  వాళ్లకి  ఇద్దరు  భార్యలు  ఉంటారు , అదృష్ట  వంతుడా / దురదృష్ట  వంతుడు  అంటాడా  :P 

14. ఎవరి  కాళ్ళు  అయినా  దాటి  వెళితే  వాళ్ళ  ఆయుష్షు  తగ్గి  పోతుంది  తెలుసా 

ఇప్పటికి  ఇవే  గుర్తొస్తున్నాయి  , మీకు  ఏమైనా  తెలిస్తే  గుర్తు  తెచ్చుకుని  నవ్వుకోండి  :)

అయ్యో  కుక్క  అరుస్తుంది  , దానికి  ఏమైనా  దెయ్యం  కనిపించి  ఉంటది  ఏమో  .. ఇప్పుడు  ఎలా  :P  

8, సెప్టెంబర్ 2014, సోమవారం

మేము ఆ నెక్స్ట్ రోజు ఎంత సేవింగ్ చేసాం అంటే

చాలా  రోజుల  తర్వాత హైదరాబాద్  వెళ్లి  నప్పుడు  ఎంత  ఆనందం  వేసిందో .. ఉన్న వారం  రోజులు  వర్షం  పడుతూనే ఉండటం  అంత  చిరాకు  వేసింది  :(

సింగపూర్  చేస్తాము  సింగరాయి  కొండ  చేస్తాము,అంటారు  కానీ  అదే  సింగపూర్  లో   రోజూ  పెద్ద  పెద్ద  వర్షాలు  పడినా  ఒక  చుక్క  నీళ్ళు  ఉండవ్ , మన  హైదరాబాద్  కూడా  అంతే  అనుకోండి .. చుక్క  నీళ్ళు  కాదు  కదా  ముందు  నెల  వేసిన  రోడ్లు  కూడా  ఉండవ్  :P

వారం  రోజుల్లో  ఒకరోజు  eat  స్ట్రీట్  వెళ్లాను , ఇక్కడ  వచ్చిన  ప్రతి సారీ  నాకు  చిన్నప్పటి  మెమోరీస్  బోల్డు  గుర్తు  కొస్తాయి .. మధ్యాహ్నం   మూడు  వేలు  వదిలించుకుని  చేసిన  లంచ్  కంటే  సాయంత్రం  ఇక్కడ  నలబయ్యి  రూపాయిల స్ప్రింగ్  పొటాటో , ఇరవయ్యి  రూపాయిల  మొక్క  జొన్న  కంకి  తో  నెక్లెస్  రోడ్  మీద  తిరగడం  సూపర్  అనిపించింది  :)  

మేము  ఆ  నెక్స్ట్  రోజు  ఎంత  సేవింగ్  చేసాం అంటే  ఆ  స్ప్రింగ్  పొటాటో  బాంబూ  స్టిక్  ని  పనీర్   కబాబ్స్  కి  use  చేసాం  :D  స్టిక్  ఉంది  కదా  అని  కబాబ్  కి డబ్బులు  తగలేసి  మళ్లీ  సేవింగ్  ఏంటి  అంటారా  :D  ఉష్ ..  !!!

రభస  మూవీ  కూడా  చూసా  అనుకోండి .. ఎన్టీఆర్  బావున్నాడు :D  .. సినిమా / సినిమాలు  watever  పిచ్చ  బోరింగ్ ..పాపమ్  ఆ  డైరెక్టర్ రెండో  సారి  ఆయనతో  ఎన్టీఆర్   ఇంకో సినిమా  చెయ్యడని   భావించి రాసుకున్న  అన్ని  సినిమాలు  కలిపి  పడేసాడు  మన  తల  మీద  :(

ఇంతకీ  ఈ  మధ్యలో   నేను  సాధించిన  అతి   గొప్ప  పని  గురించి  రాయ  దలుచుకున్నా  :D గత  అక్టోబర్  నుండి  ఇలా  తినడం ,తిరగడం  తప్ప  ఏం  పని  లేకపోవడం  వల్ల ,తింటూ  కూర్చుంటే  కొండలు  కరుగుతాయో  లేదో  కానీ  వెయిట్  మాత్రం  బాగా  పెరుగుతుంది ...  :(  మళ్లీ  వెయిట్  లాస్ అంటే అదో  మహా  ప్రస్థానం  నా  ఫిట్నెస్  instructor  బుజ్జీ  ను  ఇలా  ఒక్కసారే  అన్నీ  మానేసి  తిని  కూర్చుంటే  కష్టం  అని  నాలుగు  తిట్టి , workouts  తో  పాటు  లో  కార్బ్  డైట్   ఫాలో  అవ్వు  అని  చెప్పాడు ... అతను  లో  కార్బ్స్  తిను  అంటే  నేను  ఇంకా  extreme  కి  వెళ్లి  " atkins  డైట్ " ప్రిఫర్  చేసాను .. రోజుకి  20gm  కార్బ్స్ ,మిగతాది  అంతా  ప్రోటీన్  ,fat , ... ఇది  మొదటి  రెండు  వారాలు  చెయ్యలిసిన  డైట్ ,తర్వాత  వేరే  వేరే  phases  లో  వేరే  వేరే  ఫుడ్ ..

నేను  ఈ  విధంగా ,గుడ్లు,చికెన్ ,సలాడ్స్  మీద  బతకగలను  అన్న  సంగతి  ఇప్పటి  దాకా  తెలియలేదు  :(  whatever  లాస్ట్  కి  సూపర్  వెయిట్  లాస్  అండ్  మళ్లీ  వర్కౌట్స్  వల్ల maintain  చెయ్యగలుగు  తున్నా ... నన్ను  చూసీ  inspire  అయిన  ఇద్దరు  ట్రై  చేసి  మిగ్రేన్  తెచ్చు  కున్నారు  :( :(

లో  కార్బ్   diets   atkins ,south బీచ్ అందరికీ సరి  పోవు , చాలా  complications  కూడా  ఉంటాయి , బట్  పని  చేస్తే  మాత్రం  చాలా  బాగా  పని  చేస్తాయి, అమ్మాయిల్లో  pear /hour గ్లాస్  కి  బెస్ట్  ... !!!

gym /jog   అలవాటు  చేసుకోవటం  మంచిదే  కానీ  ఇక్కడ  విషయం  ఏంటి  అంటే మీరు  వర్క్  అవుట్  అసలు  చెయ్యకపోయినా పర్వాలేదు  కానీ ,బాడీ  కి కష్ట  పడటం  అలవాటు  చేసి ,ఒకసారే  మానేస్తే ,మీరు  ఇంకా  వర్క్  అవుట్  చేస్తారేమో ,ఇంకా  ఎనర్జీ  కావాలని ఏమో  అని  బాడీ  calories  స్టోర్  చేస్తూ  ఉంటుంది , ఫలితం  జీన్స్  లో  ఐష్  నుండి  జాజ్బా  లో  ఐష్  అవుతారు  అన  మాట  :)

సరే   14 రోజులు "లో  కార్బ్"  ఫాలో  అవ్వాలి  అనుకునే  వాళ్లకి  sample  డైట్

మార్నింగ్  : ఎగ్స్ / ఒక  పెసరట్టు, కాఫీ ,టీ  షుగర్  లేకుండా ఎందుకంటే   1gm  షుగర్  = 5gm  కార్బ్
లంచ్  : చికెన్/ఫిష్ /మటన్  (ఎలాగయినా కానీ  వితౌట్  రైస్ /రోటి  ) , ఆలివ్  ఆయిల్  preferable , veg  అయితే  పనీర్ /tofu , or  ఏదయినా  కూర  (cabbage /బెండి /brinjal /బ్రోకోలి /కాలీఫ్లవర్ /టమాటో  అలాంటివి .. నో  carrot /beetroot )
డిన్నర్  : same  లంచ్  లా .. fruits  లో  షుగర్స్  ఉంటాయి  కాబట్టి  ప్రిఫర్  చెయ్యద్దు

పాలు  వద్దు ,cheese  ,yogurt  తినచ్చు ....

14 రోజుల  తర్వాత  రొజూ  రోటి /చిన్న  బౌల్  రైస్ / లో  షుగర్  fruits  ఆడ్  చెయ్యండి ,  ఫస్ట్  రెండు  రోజులు headache /fatigue  ఉంటాయి  కాబట్టి  వీకెండ్స్  సెలవు  ఉన్నప్పుడు  స్టార్ట్  చెయ్యండి ...  ఎక్కువ  అనిపిస్తే  వెంటనే  ఆపెయ్యండి  .. !!