21, జూన్ 2014, శనివారం

అసలు ఒక డెవలపర్ ఎన్ని లాంగ్వేజ్ లు నేర్చుకోవాలి ???

 అసలు  ఒక  డెవలపర్  ఎన్ని  లాంగ్వేజ్  లు  నేర్చుకోవాలి  ??? 

ఇప్పటికే  వందల్లో  ప్రోగ్రామింగ్  లాంగ్వేజ్  లు  ఉన్నాయి , ఇంకా  ... సంవత్సరానికో  కొత్తది  కనిపెడుతున్నారు 

ఈ  మధ్య  ఒక Developers conference లో  ఆపిల్  ఇంకో   programming  language  ని  పరిచయం  చేసింది . "స్విఫ్ట్ " దాని  పేరు . 
                     
ప్రతీ పెద్ద  కంపెనీ  దాని  కోసం  ఒక  కొత్త  లాంగ్వేజ్  కనిపెట్టేసుకుంటుంది , Face book  ఏమో  hack దాని  back end  development కోసం కల్పించుకుంటే గూగుల్  ఏమో  జావా స్క్రిప్ట్  కి రీప్లేస్మెంట్ గా  "డార్ట్"  అలానే  ఇంకో  ప్రోగ్రామింగ్  లాంగ్వేజ్  "గో" వాడుకుంటుంది 

అసలు  ఉన్నవి   వాడుకోకుండా  ఇవి  ఎందుకు  కొత్తవి  కనిపెడుతున్నారు ??

ఎందుకూ అంటే  వాటికి  ఆ  capability  ఉంది  కాబట్టి ,  ఉందని  కొత్తవి  కనిపెడుతున్నాయి  సరే  ఎందుకంటే designing  complex   కాకపోవచ్చు  ఎందుకంటే  మంచి  resources  ఉన్నారు  కాబట్టి   కానీ  దాని  కన్నా  పెద్ద  తల  నొప్పి  ఏంటి  అంటే  వాటికి  సపోర్ట్  ఇవ్వగలగడం , అసలు  కనిపెట్టిన  కొత్త  దానిని  developers  ఇష్ట  పడేలా  చెయ్యగలగడం , అసలు  ఎందుకు  వాడలో  convince  చెయ్యగలిగితే  సగం  సక్సెస్  అయినట్టే 

ఒకటి  మాత్రం  నిజం  పాత  లాంగ్వేజ్  లు  ఇప్పటి  కాంప్లెక్స్  ఫ్రేమ్  వర్క్  ని  సపోర్ట్  చెయ్య  లేకపోవచ్చు , ఇప్పుడు  ఫేస్బుక్  నే  తీసుకుంటే   

Face book's main goal with Hack —was to improve code reliability, in this case by enforcing data-type checking before a program is executed. Such checks ensure that a program won't, say, try to interpret an integer as a string of characters, an error that could yield unpredictable results if not caught. In Hack, those checks take place in advance so that programmers can identify such errors long before their code goes live. -  ఇది  ఒక  ఫేస్బుక్  డెవలపర్  చెప్పిన  మాట 

 అసలు  పేస్  బుక్  php  కి  రీప్లేస్మెంట్ గా  ఇప్పుడు  ఉన్న  వేరే  కొన్ని  లాంగ్వేజ్  లు  చూసింది  , మీరు  అందరూ  ఈ  మధ్య  బాగా  విన్న   అలాంటి ఒక  లాంగ్వేజ్  స్కాలా  (జావా  మీద  స్కాలా  నాకు  నచ్చుతది , తక్కువ  లైన్  కోడ్  రాసేయచ్చు  :P  ), కానీ కోడ్  మొత్తం  php  నుండి  స్కాలా   కు  మార్చడం  కష్టం  ఎందుకంటే  ఇవి  రెండు  టామ్  & జెర్రీ  లాంటివి   compatible  కావు  :) సో  php  కి  దగ్గర  గా  ఉండే  ఇంకో  సూపర్  సెట్  లాంగ్వేజ్  ని  అది  తయ్యారు  చేసుకుంది  అదే  HAck .  చాలా  మటుకు  సైట్  php  నుండి  hack  కు   మైగ్రేట్  అయ్యిపోయింది .  fb  చేసిన  ఇంకో  పని  ఏంటంటే  hack  ని  ఓపెన్  సోర్స్  చేసింది సో  మీకు  పనికి  వస్తుంది  అనుకుంటే  మీరు  కూడా  నేర్చుకుని  వాడుకోవచ్చు  ... !!!

ఇప్పుడు  ఆపిల్  ఏం  చేస్తదో తెలీదు  కానీ  iphone  4 కి  మాత్రం  సపోర్ట్ ఇంక  మీద   చెయ్యదు ... ప్రపంచం  లో  రుబిక్  క్యూబ్  తర్వాత  ఎక్కువ  అమ్ముడు  బోయింది  ఐ ఫోన్ -4 నే అంట, నిజానికి  iphone  నిజమైన  innovation నాకు  అదొక్కటే  అనిపిస్తుంది  (దాని  ఫోన్స్  లో )


Amazon కూడా  కొత్త  ఫోన్  రిలీజ్  అయ్యింది  

రివ్యూ  ఇక్కడ చదువు  కోండి 

http://tech.firstpost.com/news-analysis/specs-review-is-amazons-new-fire-phone-worth-the-price-tag-226081.html

అంతా  బానే ఉంది  కానీ  kindle  లా  cheap  గా  మీకు  దొరకదు  ఎందుకంటే  అది  AT&T  తో  టై  అయ్యి  ఫోన్  ని  రిలీజ్  చేస్తుంది  కాబట్టి   jeff  చేసిన biggest  mistake  ... !!

సో ... రెండేళ్ళు  కాంట్రాక్టు  బాధ  తప్పదు , అది  తప్పించుకోవాలి  అంటే  ఇంచు  మించు  699 $  తో విడిగా కొనుక్కోవాలి    :O 

మరి గూగుల్  చెయ్యాలి  అనుకుంటున్న  innovation  humanoids  (human service  robots ) , ఆండ్రాయిడ్  ఫౌండర్  ఆండీ రూబిన్  ప్రాజెక్ట్  ని  లీడ్  చేస్తున్నారు  అంట . గూగుల్  కి ఈ ప్రాజెక్ట్ moonshot  లాంటిది      .. !!

ఆండ్రాయిడ్   versions పేర్లు   ice -cream , eclairs , kit-kat   లాంటివి పెట్టారు , humanoid  version పేర్లు జేన్నిఫెర్ లారెన్స్ , ర్యాన్  గోస్లింగ్  పెడతారేమో  :D  

 Saturday  Sunday   అన్న  జాలి కూడా   లేకుండా ఈ  పిల్ల ప్రాజెక్ట్ ,టెక్నాలజీ  అని  తినేస్తుంది  అని  అనుకుంటున్నారు  కదా .. :)  సరే  ఇంక  ఆపేస్తున్నా  ...  ;D 


హ్యాపీ  వీకెండ్  .. !!!










13, జూన్ 2014, శుక్రవారం

చూసారా .... డబ్బు పెంచుకోవటం ఎంత ఈజీ నో :)

ఏంటో  పని చేసినా..   చెయ్యకపోయినా  , ఫ్రైడే వచ్చిందంటే  ఇంక వచ్చే  రెండు  రోజులు  బిందాస్  గా  ఉండచ్చు  అనిపిస్తుంది  :D  కొంచెం  ఆలోచిస్తే ఆ  అయిదు  రోజులు  సంపాదించిన   డబ్బులు  తగలేయ్యటానికే  దేవుడు కాదు..  కాదు  కార్పొరేట్  కంపెనీ లు  సెలవు  ఇచ్చి  ఉంటాయేమో  అనిపిస్తుంది :D లేకపోతే  ఎక్కడ ఎంప్లాయిస్ జీతం అంతా దాచేసుకుని కొత్త  కంపెనీ  స్టార్ట్  చేసేస్తారు  అన్న  భయం  ఏమో  :P

మా  అమ్మ   ఎప్పుడూ  డబ్బులు  భలే  మేనేజ్  చేసేది , ఏమి  చెయ్యకుండానే  బోల్డు  సేవింగ్  చేసేది :) చివరికి  నాకు  మా నాన్నకే  ఇచ్చేది అది వేరే సంగతి అనుకోండి  :D నేను  కూడా  బానే  సేవ్  చేస్తాను ,  డబ్బులు  దాచీ ...   దాచి...   ఒకానొక మంచి రోజున  ఏ  బట్టలు షాప్  వాడి కో చెప్పులు  షాప్  వాడికో  సమర్పించుకునే దానిని ... !!!

  నాకు బాగా   అర్ధం అయిన  సంగతి ఏంటంటే   మనిషికి  financial  literacy  తిండి  ఎంత  అవసరమో  దానికి మించి  అవసరం అని  (డబ్బులు లేకపోతే  తిండి  మాత్రం ఏం దొరుకుతుంది ) ...  50 రూపాయిలు సంపాదించి  5000 చెయ్యగలిగిన  చదువు లేని  వ్యక్తి  , 5000 సంపాదించి  ప్రతీ రూపాయి  బట్టలు  మీద , పిజ్జా chocolates  మీద  తగలేసే ph. d  స్టూడెంట్  మీద  చాలా  బెటర్  కాదంటారా ?



నేను  ఒక  5 ఏళ్ళ  కిందట  మా  బావ  ఇంట్లో  ఒక బుక్ 20 పేజీ లు  చదివి  ఆపేసాను  , బుక్  పేరు  "రిచ్ డాడ్ పూర్ డాడ్ " , మళ్లీ  అదే  పుస్తకం  వారం  కిందట  చదివాను , మొదటి  సారి  చదివినప్పుడు  ఏది  అర్ధం  కాలేదు  ఎందుకంటే  అప్పటికి నాకు  టాక్స్  అంటే  ఏంటో  తెలీదు ,మామూలు చదువు  ఏ  ఎక్కువ  అనుకునే  టైం  కాబట్టి  పెద్దగా  ఏమి  ఎక్కలేదు  ,కానీ మొన్న  చదివి  నప్పుడు  అనిపించింది  ప్రతీ  ఒక్కరూ  ఒకసారి  అయినా  చదవాల్సిన  బుక్ అని, atleast  డబ్బు  సంపాదించే  వాళ్ళు  ఇంకా  ఎక్కువ  సంపాదించాలి  అనుకునే  వాళ్ళు , బాగా  ఖర్చు  చేసే  వాళ్ళు  కూడా  :D  ఎందుకంటే చదివాకా..   ఒక  రెండు  మూడు  రోజులయినా  మీ  ఖర్చులు కంట్రోల్  చెయ్యాలి  , మీకంటూ  ఏదయినా  చేసుకోవాలి  అన్న  ఆలోచన  తప్ప కుండా  వస్తుంది కాబట్టి ... !!

నెలకు  లక్ష  సంపాదిస్తే  30% టాక్స్  కింద  గవర్నమెంట్  కి  pay  చేస్తున్నాం , పోనీ  ఇంకా  మంచి  జాబు తెచ్చుకుని  ఎక్కువ  డబ్బులు  వెనకేసుకుందాం  అన్న  ఆలోచన వినటానికే   చాలా  బాగా అనిపిస్తుంది  గానీ , జీతం  పెరిగే  కొద్దీ  మనం  కట్టే  టాక్స్  కూడా పెరుగుతుంది  ..  !!!  సంపాదిస్తే  income  టాక్స్ , ఖర్చు పెడితే  సర్వీస్ టాక్స్ ,మంచి hotel లో  రెండు  రోజులు ఉంటే luxury   టాక్స్ ,ప్రతీ  దానికీ  వేల్యూ  అడేడ్  టాక్స్ ...  దేవు ... డా  అసలు  డబ్బు  వచ్చే  మార్గం  ఒకటయితే  పోయే  వేంటి  వంద  కనిపిస్తున్నాయి, ఇవి  మనకు ఖర్చులు కానీ  వేరే  వాళ్లకి  income  ఏ  కదా , సో  మనకు  కూడా  సంపాదించటానికి  ఇంకో   99 మార్గాలు ఉన్నాయి కానీ  మనం గుర్తించం ,రిస్క్  తీసుకోము !!!

ఇంతకీ   ఆ  పుస్తకం   లో  మెయిన్  పాయింట్  ఏంటంటే  , మీ  బాలన్స్  .. అదే  బ్యాంకు  బాలన్స్  అప్పు  బాలన్స్  కాదు  :D  పెరగాలంటే  asserts  మీద  మీ  డబ్బులు  పెట్టండి , liabilities  మీద  కాదు

1.Asset  - వీటి  వల్ల  మీరు  డబ్బులు  మీ  జేబు లోకి  వస్తాయి  eg : రియల్  ఎస్టేట్ , investments , మీరు  ఇంట్రెస్ట్  కి  ఎవరికయినా  మీ  డబ్బు  ఇచ్చి  ఉంటే  అవి, ఏదయినా  సరే మీరు  ఒకసారి  పెట్టుబడి  పెడితే  తర్వాత  తర్వాత  వాటి  నుండి  మీరు  ఏమి  చెయ్యకుండా  డబ్బులు  రావాలి, దీనినే  డబ్బు  మీకోసం  పని  చెయ్యటం అంటారు  !!

2. Liability  : మీరు  ఎవరికయినా  ఇవ్వాలిసిన  డబ్బు  లేకపోతే  ఏదయినా  కొన్న  తర్వాత  దానికి  మీరు  ఇంకా ఇంకా  ఇన్వెస్ట్  చేస్తున్నా  అది  liability  .. సో  అలాంటి  వాటి  మీద  మీ  డబ్బు  ఎంత  తక్కువ  పెడితే  అంత  మంచిది.

చూసారా  .... డబ్బు  పెంచుకోవటం  theory ప్రకారం  ఎంత  ఈజీ  నో :) ఇంక    ప్రాక్టికల్ గా  మీ   తిప్పలు మీరు  పడండి , వర్కౌట్  అయితే  నాకు  కొంచెం  చెప్పండి  :P అన్నిటికీ  మించి  పైన  చెప్పిన  పుస్తకం  చదవండి  :D


















11, మే 2014, ఆదివారం

పేరు గొప్ప ఊరు దిబ్బ అనేది మా అమ్మమ్మ

ఈ హైదరాబాద్ లో ఎన్ని రెస్టారెంటులు ఉన్నా ఎక్కడ  చూసినా  వందల  కొద్దీ జనాలు ,గంటలు  కొద్దీ  వెయిటింగ్  లు .

ఒక్కోసారి  (అంటే  చాలా  సార్లు  అనుకోండి  ఈ  జాబు  చేసుకోవటం కన్నా  ఒక డబ్బా వాలా  పెడితే కొద్ది రోజుల్లో డబ్బున్న వాలా  అయిపోవచ్చని )

మొన్న  ఎవరో  లక్షలు పెట్టి ఇంజనీరింగ్ లు చదివి  సాఫ్ట్వేర్ జాబు  చేస్తున్న వాళ్ళ కన్నా, రెండో క్లాసు  పాస్  అయ్యి రెండు ఆవులు ,రెండు గేదెలు కొనుకున్న  వాళ్ళు   నెలకు  లక్ష  పైగా  సంపాదిస్తున్నారు అని  బావురు  మంటే  ఏంటో  అనుకున్నా  కానీ , సంపాదించినదంతా పాలోడు ,నీళ్లోడు  ,ఇంటోడు , ఇలా  restaurant వాడు (మర్చిపోయా  ఇక్కడ hitech సిటీ లో ఆటో వాడు  నెలకు  40k  వస్తుంది  అన్నాడు  ) ,   ఇలా  సర్వీస్  టాక్స్, income టాక్స్ , vat అని  దోచేస్తుంటే ఎలా  పాపం  సో కాల్డ్ రెండు పదుల వయుసులో అయిందంకల జీత గాళ్ళు  మూడంకెల మించి  సేవ్ చెయ్యగలరు , పేరు  గొప్ప ఊరు  దిబ్బ  అనేది  మా అమ్మమ్మ  , సరిగ్గా సరిపోతది   :)



ఏదో  రాస్దాము  అని  మొదలు  పెట్టి  ఎటో  వెళ్లాను , ఇంతకి  ఏంటంటే  నిన్న  సాయంత్రం  ఎక్కడికయినా  వెళ్దాము  అనుకుని  డిన్నర్  కి , AB  (absolute barbeque ) అని  మాదాపూర్  లో  ఒక  ప్లేస్  కి  వెళ్ళాము , ఈ మధ్య  హైదరాబాద్  లో ఇదే  బఫెట్  కి టాప్ .. 7. 20 కి వెళ్తే  గంట  waiting  అన్నాడు , అన్నిటి  కన్నా  ఇక్కడ  hightlight ఏంటి  అంటే  table  కావాలంటే  రెండు  రోజులు  ముందు  కాల్  చేసి  చెప్తే  ప్రాబ్లం  ఉండదు  అన్నాడు .... !!!


మేము  బయట  ఉంటే , మీరు  బార్  లౌంజ్  లో  ఉండండి   ఇంకా  గంట ఉంది   కదా బయట  వేడిగా ఉంది  అని లోపలకి పంపాడు ,  గంటకి  ఖాళి  అయ్యి వాడు  రమ్మని  పిలిస్తే , గూగుల్  కి  మొదటి  ఇండియన్  CEO గా  నన్ను ప్రకటించి  నంత  ఆనందం  కలిగింది  :)

  మేడలో  ఒక  బాక్స్  తగిలించుకుని  tequila  270 rs  ఆర్డర్  చేస్తారా  అని  వాడు  అందర్నీ  అడుగుతుంటే  నాకైతే రైల్వే స్టేషన్  లో  టీ -కాఫీ  అమ్మే  వాడు  గుర్తొచ్చాడు  ...  ఇంచు మించు  వెయ్యికి  దగ్గరలో  ఉన్న  బఫెట్  ఒక్క  tequila  షాట్  తో వెయ్యి  చెయ్యాలన్న  తాపత్రయం నచ్చినా ,  తాగి  తిన్నది  బయటికి  తెచ్చుకుని  మూడు  నాలుగు  వేల  బట్టలు  నాశనం చేసుకోవటం  అనవసరం అనిపించింది  :P

అక్కడ  ఒక  family  వస్తే  డిన్నర్  కి  ఈజీ గా  విత్ టాక్స్  5గురు కి  5k ,  పాలోడు ఇలాంటి  చోట పాలు అమ్మి    లక్ష  వెనక  వేసు కుంటున్నాడు , పాపం  సాఫ్ట్వేర్  వాడు కార్పొరేట్  కల్చర్ అనుకుని  కప్పు  కాఫీ  కి  150 తగలేస్తున్నాడు  :(

కానీ ఏ  మాటకు  ఆ  మాట   ఇక్కడ  బఫెట్  మాత్రం  చాలా  tasty  గా  చేస్తాడు, హైదరాబాద్  సి  ఫుడ్  లవర్స్  సూపర్  గా ఎంజాయ్  చెయ్యచ్చు   , కోడి ,మేక , పీత  మాత్రమే  కాదు  పాపం  ఆక్టోపస్ ,స్క్విడ్ ,కుందేలు  దేనినీ  వదల లేదు  వాడు

చూసారా....   కోడి  అంటే  మనం  తినడానికే  అన్నట్టు  బాధ  అనిపించట్లేదు  కాని , కుందేలు  ఇవీ  అవీ  చూస్తే  పాపం  అనిపిస్తుంది , మనం  మనుషులం  అన్నిటినీ  సమానంగా   చూడలేము , లక్ష  సంపాదించినా  పాలోడు  పాలోడే , ఏమి  చెయ్యకుండా బెంచ్  మీద  project లేకుండా  20k  వచ్చినా  ఇంజనీర్  ఇంజనీర్  యే   :)






9, ఏప్రిల్ 2014, బుధవారం

దేవుడికి పేరు గుర్తు తెచ్చుకునే పని తగ్గించటానికి ఏమో :D

శ్రీ రామ నవమి  రోజు ఎలాగైన  వర్షం పడుతుంది  అని  మా అమ్మమ్మ  అనేది , పొద్దున్న  11 గంటలకి  (అంటే మరీ పొద్దున్న కాదు లే   :D ) హైదరాబాద్  గూగుల్  ఆఫీసు  opposite లో  ఒక సీత రామ  ఆంజనేయ స్వామి  గుడి ఉంటుంది , నేను పొద్దున్న  వెళ్తే జనాలు ఉంటారని 11 గంటలకి వెళ్లాను, కానీ అక్కడ కళ్యాణం  12 ఇంటికి మొదలవుతుంది  అంట .. నేను  వెళ్ళే టైం  కి  కొత్తగూడ  నుండి  hitech city  దాకా  ఉంది లైన్ ... మొత్తం హైదరాబాద్ లో ఉన్న  సాఫ్ట్వేర్ వాళ్ళందరూ తమ  తామ id  కార్డ్స్  వేసుకుని  (దేవుడికి పేరు గుర్తు తెచ్చుకునే  పని తగ్గించటానికి ఏమో  :D )   దర్శనం కోసం  ఉన్నారు

ఇలా  ఇంక  దర్శనం కోసమే ఉంటే నా  పనులు అవ్వవని దూరం నుండి దణ్ణం పెట్టుకుని వచ్చేసాను ... కానీ దేవుడికి నేను  అంత  దూరం  నుండి  వెళ్ళిపోవడం  నచ్చలేదనుకుంటా :D  సరిగ్గా  ఒంటి  గంటకు లంచ్ చేస్దామని అని కిందకు  రాగానే ,నా  ఫ్రెండ్ వచ్చి  రా  ఎదురుగానే  గుడి ఉంది  కదా ,ఒకసారి  వెళ్దాం  అని , నేను  ఏమి చెప్పకు పోయినా  తీసుకుని పోయారు



ఈసారి కొంచెం రష్ తగ్గింది ... బయటకు రాగానే మా అమ్మమ్మ  మాటలు  గుర్తొచ్చాయి "శ్రీ రామ నవమి  రోజు ఎలాగయినా   వర్షం పడుతుంది  "  ఇంచు మించు  40 డిగ్రీ  ఉంది  బయట  నాకైతే  ఆ  ఎండ  తగల గానే  అప్పుడే  తల నొప్పి వచ్చినట్టు  అనిపించింది , మొత్తానికి దర్శనం  అయ్యింది , చాలా మంది కేవలం  అక్కడ ఈ రోజున  పానకం ,వడ పప్పు  తిందాం అని  గుడి కి  వచ్చిన  వాళ్ళే , నా నార్త్ ఇండియన్ ఫ్రెండ్ కి  పానకం అంటే ఏంటో అర్ధం అయ్యేలా చెప్పే సరికి నా గొంతు  ఆరిపోయి నాకు కూడా పానకం తాగాలనిపించింది  :) (నేను బెల్లం తినను ,మిరియాలు అస్సలు పడవు  అందుకనే  టేస్ట్ కి తప్ప  పానకం  అంటే అంత ఇష్టం  ఏమి లేదు )

ఆ  పానకం గుడికి  కిలో మీటర్ దూరం  లో పెట్టాడు , అది  తప్ప దొరికిందే ఛాన్స్ మళ్లీ వీళ్లెప్పుడు గుడికి వచ్చి ప్రసాదం  కొనుకుంటారు  అనుకున్నారేమో ,అన్నిటికీ ఒక  price పెట్టి అమ్మేస్తున్నారు  :)

ఆ  హడావిడి నుండి  బయటికి వచ్చి ,పని  చేసుకుని సాయంత్రం 5 కి  కింద ఉన్న  బరిస్టా  కి  వెళ్దాం అని  దిగగానే , ఒక్కసారిగా  ఆకాశమంతా  మబ్బుగా  అనిపించింది ,చల్లగా  గాలి  తగులుతుంటే  మధ్యాహ్నం అంత  ఎండ  తర్వాత భలే  అనిపించింది ... రాత్రి చినుకులు కూడా  పడినట్టున్నాయి  :) ఇప్పటికే  climate  అలానే ఉంది .. !!!

చాలా  రోజుల  కిందటి వరకు  రాముడు సీతను  అంత కష్ట పెట్టాడు  ,అడవులలో  వదిలేసాడు  ,మరి  అలాంటిది రాముడు లాంటి భర్త ఎందుకు రావాలి అంటారు  అనుకునే  దానిని , కానీ  ఆలోచిస్తే  రాముడు  సీత  దగ్గర  లేకపోయినా  అన్ని  సంవత్సరాలు సీత  ను  తప్ప ఇంకో అమ్మాయి గురించి ఆలోచించలేదు , అలా ఎంత మంది అబ్బాయిలు  ఉంటారు , ఉన్నన్ని రోజులు చాలా  ఇష్టం అని చెప్పి , తర్వాత గొడవలు వస్తే  వేరే పెళ్ళిళ్ళు చేసుకుని జరిగింది మర్చిపోయి ,అసలు అలాంటి వాళ్ళే  తెలియనట్టు ఉంటున్నారు , మనకే పెళ్ళిళ్ళు  చేసుకోమని మన  అమ్మ  నాన్నలు ఇంత  pressure  పెడితే ,రాజు  అయిన రాముడికి  ఎంత  ఉండేదంటారు , అయినా కూడా  బంగారు సీత పెట్టుకున్నదే కానీ.. ఇంకో  పెళ్లి  చేసుకోలేదు  :)  ఏ  అమ్మయికయినా ఇంత  ఇష్ట  పడే  అబ్బాయి  కన్నా ఏం  కావాలి  :)

అదీ  సంగతి సమాచారం  :) 

17, ఫిబ్రవరి 2014, సోమవారం

డబ్బుకి real & symbolic meaning రెండూ ఉన్నాయి కాబట్టి ...

నాకు తెలిసిన  వాళ్ళలో ఒక అమ్మాయికి ఒక  అలవాటు  ఉంది , అదేమిటంటే  తనకు  ఒక వేళ  పక్క  వాళ్ళ  దగ్గరున్న వస్తువు  కానీ , వేసుకున్న   బట్టలు  కానీ  నచ్చితే , తను  అడిగే  మొదటి ప్రశ్న   "ఇది ఎంతకు  కొన్నావు  ? ", అది ఇప్పుడే  కొత్తగా పరిచయం అయిన  వాళ్ళు అయినా , ఎన్నో  ఏళ్ళ నుండి తెలిసిన  వాళ్ళు  అయినా , తనకు ఏదైనా  నచ్చిందంటే  " చాలా  బావుంది , ఎంత కు  కొన్నావు  ? " ,  అది .. తన  నోటి నుండి మొదట  వచ్చే question ...

పక్క  వాళ్ళు  ఒకోసారి ఇబ్బంది  పడతారు అలా అడిగితే  అని ఎవరయినా  అన్నారనుకోండి , "దీనిలో అంత ఇబ్బంది పడేదేముంది , అంత impolite  question ఏమి కాదు కదా , ఎక్కడ  కొన్నారో  చెప్పటానికి ఇబ్బంది  లేనప్పుడు ,ఎంతకు కొన్నారో  చెప్పటానికి  ఏంటి ??  రెండు  ఒకలాంటివే  కదా  అని  దీని  అభిప్రాయం  :)

David  Kruger  అన్న  ఒకాయన  ఈ  విషయం  గురించి  ఇలా  రాసాడు

"Most of us have learned to talk more easily about sex, yet remain seclusive, embarrassed, or conflicted about discussing money. Money may be the last emotional taboo in our society”


నిజమే  కదా  .. !!

సరే మరి మనం ఎందుకు పక్క  వాళ్ళ  దగ్గర ఉన్న  వస్తువుల ఎంతకు కొన్నారో అని  అడగటం  తప్పని  అనుకుంటాము  ??

ఎందుకంటే  డబ్బుకి real  & symbolic  meaning  రెండూ  ఉన్నాయి  కాబట్టి  ... 

In  Reality , డబ్బు  కేవలం  మనకు  కావలిసిన , లేకపోతే  బతకలేని minimum  needs  అయిన  తిండి , బట్ట , ఇల్లు  లాంటివి అందించే ఒక  tool  లాంటిది ..

 Symbolically money represents more than self-care

Freud అనే వేరొక రచయిత 

Freud linked money to self-control and independence.  More recently, psychoanalysts recognize cultural, social, class, and gender meanings, as well as the practicalities of down to earth, concrete financial issues.  Money has come to represent things like comfort, safety, respect, worthiness, value, power, and even sexiness, love and happiness. 

నిజానికి  మనలో  ఒక్కొకరికి  డబ్బు  అంటే  ఒకో  అభిప్రాయం  ఉంటుంది , మన  దగ్గరున్న  లక్ష  రూపాయలు  మనకు  సేవింగ్స్ / ఒక  నెల  జీతం  మాత్రమే  అవచ్చు  , కానీ  ప్రపంచం లో  ఏదో  మూల  ఇంకొకరికి  అదే లక్ష  లైఫ్  అండ్  డెత్  క్వశ్చన్ అవచ్చు 

సరే  ... మరి  మీ  దగ్గరున్న  డబ్బు  మీ  గురించి  ఏమి  చెప్తుంది  ????

దీనికి  సమాధానం అంకెల ద్వారా  మనం  తెలుసుకోలేము , కానీ  మీ  దగ్గర  ఉన్న  డబ్బుతో  మీరు ఏమి  చేస్తారు , మీ  డబ్బుతో  మీ  relationship  ఎలాంటిదో  దాని  బట్టి  తెలుస్తుంది

కొంత  మంది  వాళ్ళ  దగ్గరున్న డబ్బు  బ్రాండెడ్  items  మీద  ఇన్వెస్ట్  చేస్తారు , అలాంటివి  ఎంపిక చేసుకోవటం  మనం స్మార్ట్  అని  prove  చేస్తుంది  అనుకుంటారు .

ఒక రెండు  ఏళ్ళ  క్రితం  నా ఫ్లాట్  కి  LED  TV  కొన్నాను , అది  LG  ది , చాలా  మంది  LG  ఎందుకు  Samsung  కానీ  SONY  కానీ  తీసుకుని  ఉండచ్చు  కదా  అని  చాలా  మంది  నేను  తప్పు  బ్రాండ్  కొని  డబ్బులు వేస్ట్ చేసేసాను అన్న  ఫీలింగ్  కలిపించారు , నిజానికి  అక్కడ  samsung  కన్నా  LG  specifications  ఏ  నాకు  నచ్చాయి , బెటర్ గా  అనిపించాయి , రెండిటికీ   కాస్ట్  మధ్య   కూడా  పెద్ద  తేడా  లేదు , కానీ  మిగతా  రెండిటికి  ఉన్న   బ్రాండ్  craze  వాళ్ళ , మనం  వేరేవి  ఏమి  కొన్నా   జనాలు  మనకు స్మార్ట్ సెలక్షన్  లేదనుకుంటారు  :)

అంతెందుకు  Apple  ఫోన్స్  లో  ఉన్న గొప్పదనం  ఏంటి అన్నాం   అనుకోండి , మన  taste  లో  క్లాస్   లేదు  అనుకునే  వాళ్ళు  కూడా  ఉన్నారు  :)

మనకు ఇలాంటి  వాళ్ళు  కూడా కనిపిస్తారు ...

 ఒక  ఆరు  వేలు  షర్టు  వేసుకుని , స్లీవ్  కింద  లక్ష  పెట్టి  కొన్న  వాచ్  బ్రాండ్  కనిపించే  లాగా  వేసుకునే  వాళ్ళు , పాపం  వాళ్ళ  ఎదురుగా  ఉన్న  వాళ్లకి , ఆ  రెండు  బ్రాండ్స్  తెలియక  recognize  చెయ్యలేదు  అనుకోండి , ఈ లక్ష  వాచ్  పెట్టుకున్న  వాడు , అసలు  ఎదురుగా  ఉన్నవాడు  కి తనంత  knowledge  లేదు  , తనలా  అన్ని  రీసెర్చ్ చేసి కొనే  critical  consumer  కాదు  అన్న  conclusion  కి  వచ్చేసి , వీడే  Intelligent ,smart  అనుకుంటాడు  అనమాట

ఈ విధంగా  డబ్బు  వాడికి ఒక  రకమయినా సెక్యూరిటీ , తెలివయిన  వాడిని  అన్న  భావన  ఇవ్వటానికి  సహాయ  పడింది

ఇంక  మనలో  చాలా  మంది  చెప్పే  లైన్

" నేను  డబ్బుకు  అంత  importance  ఇవ్వను , కానీ  నాకు  కావలిసిన  వాటిని  నేను  కొనుకున్నేంత  ఉంటే  చాలు " అనుకుంటాము  ( నేను  అలాంటి  దాన్నే అనుకోండి  )

ఇది వినటానికి  చాలా  rational  గా  అనిపిస్తుంది  ;) కానీ  అసలు  కథ  అక్కడితో  ఎండ్  అవ్వదు

ఒక అమ్మాయికి  travelling  అంటే  చాలా  ఇష్టం , తను  సంపాదించే  డబ్బు  దాని  కోసం  మాత్రమే  సేవ్ చేసి , కావలిసిన  డబ్బు  వచ్చాకా  , వేరే  చోటికి  vacation  వెళ్ళేది , డబ్బు  అంతా  అయిపోయాక , మళ్లీ  job  చెయ్యటం  స్టార్ట్ చేసేది , తన  వరకు  డబ్బు  అంటే  "vacation " కి  మాత్రమే

కానీ  తర్వాత  పెళ్లి  అయితే  ??? తన  హస్బెండ్  కోసం  స్పెండ్  చెయ్యటానికి  కావాలి , తర్వాత  తన  పిల్లల  కోసం  కావాలి ...  ఇవన్నీ  అసలు  ఎందుకు  చెయ్యాలి  ?? ఎందుకు అంటే .. తను లైఫ్  లో  రైట్  decisions  తీసుకున్నాను  అని  prove  చెయ్యటానికి  :)


నా  ఫ్రెండ్  కి  పక్క  వాళ్ళు  చెప్పే వస్తువు  ధర  కేవలం  piece  of  information  మాత్రమే , దానితో  అది  వాళ్ళ  status  ని  అంచనా  వెయ్యదు ( ఉంటారు అనుకోండి  కొంత  మంది అలా  ),  probably , పక్క  వాళ్ళు  చెప్పే  దానితో  అది  ఆ  వస్తువు  కొనుక్కొగలదా లేదా  అని  ఆలోచించవచ్చు

మరి  దాని  question  ని  ఎందుకు  మనలో  చాలా  మంది  misunderstand చేసుకుంటాము  ??

Money is a real and concrete concern, but it is often the symbolic, relational and self-esteem related meanings that get us into trouble. Figure those out, take them away from the money connection, and work on them. And then you can deal with money issues concretely and practically – and in a way that works for you and your loved ones.


15, జనవరి 2014, బుధవారం

డీల్ ,మాంజా , చరక్ ,సఫా :D

ఏంటో చిన్నప్పుడు స్కూల్  కెళ్ళే  మొదటి రోజు కొత్త బట్టలు,కొత్త షూస్ ,కొత్త బ్యాగు ,కొత్త పుస్తకాలు , ఇంకా చాలా గుర్తొస్తున్నాయి కొత్త కొత్తవి  :D  కానీ ఇంక మీరు  కొత్త బ్లాగ్ లో కూడా నీ సోది ఏంటి నిఖిత  పాప అంటారని  ఆపేస్తున్నా  :D :D

ఏంటో  ఎంత  పెద్ద అయినా ఈ  కొత్త  పిచ్చ  పోలేదు  :)

ఇక నుంచి నా కొత్త రాతలు ,గీతలు  ( అంటే  for suppose  future  లో ఒకవేళ బుద్ధి   పుట్టి , కలర్  పెన్సిల్స్  colorful  గా  అనిపించి , గీసే  సాహసం  చేస్తే ............ !!!  :D ) అరే  మీరు  కంగారు పడకండి " చేస్తే ..... " అన్నా , ఓహ్  ఇప్పుడు  ఒక  డౌట్  వచ్చింది  అప్పుడు  నా  బ్రష్  నేమ్  ఏం  పెట్టుకోవాలి ? పికాసా  లాగా  నా  పేరుకి కొంచెం  కలిసేలా  నికాసా ,చకాసా .. తూచ్  ఏడ్చి  నట్టు  ఉన్నాయి :(  సరేలే  ఇది మళ్లీ మాట్లాడుకుందాము 

 ఇందుకే  అంటారు , మనం  లేని  సమస్యలు  సగం  ఊహించుకుని  70mm  లో  5D లో   చూసేసి  బాధ  పడతాం అని ... !

సంగతి   ఏంటి  అంటే తర్వాత  నుండి  www.chandrasenaa.blogspot.in లో   కూడా  బ్లాగ్ పోస్ట్స్ రాస్తాను ... 

 ఇందాక  5D  అంటే  గుర్తొచ్చింది , ఇక్కడ  Hyderabad  లో  kukatpally  దగ్గర   మంజీరా  మాల్  అని  ఒకటి కొత్తగా కట్టారు  , అక్కడ  7D  ధియేటర్  కడుతున్నారు అంట ,అంటే  ఒకవేళ horror  మూవీ  చూస్తే  నిజంగా  దెయ్యం  పీక  పట్టు  కున్న  ఫీలింగ్ వస్తుందా అమ్మయ్యో ...   :( :( 

Lodha  అపార్ట్మెంట్స్  ఉన్న  సర్కిల్  లో  కూడా  ఇంకో  మాల్ ,  ఇంకా మల్టీప్లెక్స్   కడుతున్నారు ... ఏంటో  ఎన్ని ఇల్లు  ఉన్నా రెంట్  కి ఒక్కటీ  ఖాళీగా ఉండవు   , ఎన్ని   సినిమా  హాళ్ళు  ఉన్నా  ఫస్ట్  డే  టికెట్స్  దొరకవు  :(

నేను  వన్  మూవీ  చూసానోచ్చ్ .. actually  ఫస్ట్  డే  నే  చూసేసాను (ఒక్కోసారి ,జన్మకోసారి  ఇలాంటి  సాహసాలు) ,  భలే  ఉన్నాడు  మహేశ్  బాబు  :D , స్టోరీ  బావుంది , కొత్త  గా (unexpected ) , అందుకే  మన  వాళ్ళు   అస్సలు  రిసీవ్  చేసుకోలేదు (ఇది expected )   :( 

Screenplay  బావుంది , "ప్రేమ  కన్నా  భయం గొప్పది  సమీర " అని  ఒక  డైలాగ్  సూపర్  ఉంది , ఆ  సినిమా  టైటిల్స్  వేసి నప్పుడు , ఏదో  ఒక  పాత music  playing  instrument  చూపించాడు , చాలా  interesting  గా ఉంది

 కానీ  మెల్లగా   క్రౌడ్  పెరుగుతున్నట్టు  ఉన్నారు  , పక్కన  దిల్  రాజు  పక్కా mass  entertainer , same ఓల్డ్  అయిదు పాటలు ,ఆరు  కొట్లాటలు సినిమా స్కోప్  వేసి  మంచి  కలెక్షన్స్  తెచ్చుకుంటున్నాడు  ... !!!

మన  తెలుగు  సినిమాల  స్టాండర్డ్  పెరగదు  అంటాము , పెరిగితే  దిమాగ్  damage  , పైసా  వేస్ట్  అని  negative  publicity  ఫ్రీ  గా  ఇచ్చేస్తాము , advice  ఏ  కదా  గురూ ,ఇచ్చేస్తే  పోయే.... మన  నోటి  దురద , పక్కోడి  కి  future  మీద  ఉన్న  ఉత్సాహం  రెండూ  తీరిపోతాయి , అంటే   ఇక్కడ  future  అని   ఎందుకన్నా  అంటే , కొంత  మంది  రివ్యూ  బాగా  చెప్తే  చూస్తారు , ఒకవిధంగా  వాడి  జీవితం  లో  ఒక  మూడు  గంటలు  ఏం  చెయ్యబోతున్నాడు  అనేది  మీ  మాట  మీద  ఆధార పడి ఉంటుంది  :D  :D

ఇప్పుడు  Hyderabad  లో  ఎన్ని  సినిమాలు  అయినా  చూడచ్చు , సిటీ  సగం  ఖాళీ .... !!


నేను  మా  అమ్మమ్మ  ఊరు  వెళ్లి  రెండేళ్ళు   అయ్యింది  :(  ఈసారి  కూడా  వెళ్ళటం  కుదరలేదు , కానీ  అక్కడ  ఉన్న  మా  మావయ్యలు  మాత్రం  నాకోసం  జంతికలు , మా  తాత గారి  కోసం  అరిసెలు  చేసి  పంపుతారు  :)  నేను  అరిసెలు  తినను , ఆ  మాటకొస్తే  తీపివి  ఏవీ  పెద్దగా  తినను ...  దీన్లో  హైట్స్   ఏంటంటే , చిన్నప్పుడు  బొబ్బట్లు చేస్తే , నేను  లోపల  పూర్ణం  తీయించి వింత వింత shape లలో చేయించుకుని  తినే  దానిని , మళ్లీ  దానికి  ఉత్తట్టు  అని  ఒక  పేరు పెట్టుకుని  మరీ :D  , ప్రపంచం  లో  బొబ్బట్టు  తినని  తింగరి  బుచ్చి  నువ్వే  అని  మా  వాళ్ళు  అనేవాళ్ళు  అది  వేరే సంగతి  అనుకోండి  :)

ఈ  సంక్రాంతి  టైం  లో  నువ్వులు  తింటే  మంచిది  అనుకుంటా , ఎందుకంటే  ఆంధ్రా లో   అరిసెలు  చేస్కుంటే , తెలంగాణ  వాళ్ళు  నువ్వులు  చిమిలి  ఉండలుగా  చేసి పంచి  పెడతారు. ఈ  సంక్రాంతి  టైం  లో  నువ్వులు  వాడితే ఏదయినా  కీడు ఉంటే   తొలగిస్తుందని  చెప్తారు, మా  మావయ్య  వాళ్ళు  వేట  వేసే  వాళ్ళు , అంటే  కోడిని కానీ  మేకను  కానీ  బలివ్వటం , ఎందుకలాగా పాపం  కదా  అంటే ...  మా  అమ్మమ్మా  చెప్పేది... " ఈ  పెద్ద  పండగ  కాలం  అంత మంచిది  కాదు , ఎవరో  ఒకరు  ఎక్కువగా  చనిపోతూ  ఉంటారు , అందుకని  ఇంటి  నుండి  ఇలా  కోడి /మేక  ని  బలి  ఇచ్చి  రక్తం చిందిస్తారు "  అని  . కేరళ  లో జల్లి  కట్టు  కూడా ఇందుకే ఆడతారు  అంట ... !!!

ఏంటో  ... మేమైతే పూజ  అయ్యే  దాకా   ఆ  పక్క  కూడా  వెళ్ళే వాళ్ళం  కాదు , ...!!

ఇది  పక్కన  పెడితే , భలే  ఉంటది కదా  సంక్రాంతి  season ,చిన్నప్పుడు ఇంకా  సూపర్  ఎందుకంటే  holidays  కాబట్టి :D  , భీమవరం  దగ్గర  అయితే  కోడి  పందాలు , ఎడ్ల  పందాలు ..  Hyderabad  లో  వాళ్లకి  అక్కడ  ఫస్ట్  టైం   కొంచెం  కొత్తగా  ఉంటది (నాకు అలానే ఉండేది ) , ఇవన్నీ  చూసి  కాదు , kites  కనిపించవు :(  Hyderabad లో    సంక్రాంతి  అంటేనే  kites  ... డీల్ ,మాంజా , చరక్ ,సఫా  :D  ధూల్  పేట్  లో అయితే   ఎన్ని  షాప్స్  ఉంటాయో,చాలా పెద్ద  బిజినెస్ ఈ  టైం  లో   ... !!!

కానీ  ఒక  విధంగా చూస్తే  పండగలు  లేకపోతే , ఇప్పుడు  ఉన్న  కొద్ది  affections  కూడా  మన  మధ్య  ఉండవేమో అనిపిస్తుంది .. !! ఇప్పుడు  చూడండి  నేను  మా  అమ్మమ్మ  వాళ్ళ  ఊరు  వెళ్లకపోయినా  అందరూ  ఎలా గుర్తోస్తున్నారో , అందరికీ అలానే  ఉంటుంది  కదా.... atleast  వీటి  పేరు చెప్పుకుని  అయినా అందరినీ  తలుచుకోవచ్చు , కలుసుకోవచ్చు ... :)

29, డిసెంబర్ 2013, ఆదివారం

జుట్టుని కత్తికి ఇచ్చుకోవటం :D

డబ్బులు వదిలించుకుని  ఏడవటం అంటే ఇదేనేమో ... పిల్లిని చూసి నక్క వాత పెట్టుకుంది  అంటే ఏంటో అనుకున్నా కానీ  ఒకోసారి పిల్లి ఇంకో పిల్లిని చూసి వాత పెట్టుకున్నా జరిగేది ఒక్కటే ... కానీ పిల్లి తననే  చూసి మళ్లీ వాత పెట్టుకుంటే .. meow.... :D

 హిహి  నా confusion తో మిమ్మల్ని ఇంకా confuse చేస్తున్నా కదా .. :D

సరే అసలేం అయ్యిందంటే ...  హెయిర్  స్టైల్ చేయిస్దామని మా ఇంటి కిందనే ఉన్న ఒక పార్లర్  దగ్గరికి వెళ్ళా ,,, అదేదో Pinks n  Blues  అంట .. unisex salon  కి ఇంత క్రియేటివ్ గా పేరు పెట్టుకున్నారు అనుకున్నా ... కొత్త వాటి జోలికి అస్సలు వెళ్ళే అలవాటు లేని నేను ధైర్యం చేసి ఇంకో గతి లేక కిందనే ఉందని వెళ్లాను ...

జీవితం లో  కొన్ని ముఖ్యమయిన విషయాలు చిరాకులో ,కోపం లో  ఉన్నప్పుడు అస్సలు  తీసుకోకూడదు  అందులో ఒక  ముఖ్యమయిన విషయం  జుట్టుని  కత్తికి  ఇచ్చుకోవటం  :D

శుక్ర వారం  ఏంటి  అని పక్కన ఉన్న  కజిన్  వారించినా , ఇక్కడ శుక్రవారం ప్రపంచం లో  ఇంకో చోట ఎక్కడో గురువారం ,,, అయినా  రోజు బట్టి  జుట్టు పెరుగుతుందా అని దానికి కూడా  పిచ్చెక్కించి , నేను  లోపలికి వెళ్లాను

చిన్నప్పుడు  మా  పెద్దమ్మ  పౌర్ణమి ముందు కట్ చేయించుకుంటే  జుట్టు బాగా పెరుగుతుంది , అమావాస్య అయితే తొందరగా పెరగదు .. మళ్లీ దాన్లో  హస్త వాసి ,,, నా  జుట్టు  ఇన్ని factors consider చేస్తుందన్న విషయం నాకే వింతగా అనిపిస్తుంది ఇప్పుడు  .. అంటే  అప్పట్లో చిన్న పిల్లని కాబట్టి ఏం చెప్పినా  "అవునా ..  సరే "  అనేదానిని ... ఇప్పుడు కొంచెం తిక్క ఎక్కువయ్యి " అవునా .. ఏమవుతదో చూస్దాం :P " అన్న మాదిరి  తయ్యారివితిని



సరే ముందు చెప్పినట్టు కొత్త  hairstylist  అంటే  ఉన్న భయం , గౌరవం , ఏదో లే.... నాలో ఉన్న  ఒక రకమయిన భావన వల్ల నా పాత hair స్టైల్ ఫోటో  చూపించి ..  ఇలానే  చెయ్యి  అని ఒకటికి  పది సార్లు చెప్పి  ఉంటాను .. ఇప్పుడు ఆలోచిస్తే అర్ధం అవుతుంది  .. అది కూడా ఒకటికి పది సార్లు  కత్తి రించి పడేసి ఉంటుంది  :( :(

గంట  నా జుట్టు మీద ప్రయోగాలు చేసి ఓవల్  shape  కి  ఏదయినా బావుంటుంది అని సోది వేసి అర అంగుళం కట్ చెయ్యమంటే ఆరు అంగుళాలు కట్  చేసి ... క్యూట్  గా ఉన్నారని  ఒక compliment నా మోహాన నేను ఏడవ కూడని అని పాడేసి ఇంచు మించు వెయ్యికి దగ్గరలో బిల్లు వేసినా ఆ  పిల్లని , పిల్లోడిని ఏమనాలో  తెలియక వచ్చిన confusion  ఇంకా  తగ్గలేదు  :)

అందరూ డిఫరెంట్ అంటుంటే ..

అదే కదా నా బాధ .. నాలాగా నేను అనిపించట్లేదు  :(  :(

ఇప్పుడు తెలుగు  క్యాలెండరు చెక్ చేస్తున్నా అమావాస్య నా / పౌర్ణమా  అని  :P  ఈ  hairstyle  ఎక్కువ  రోజులు నేను  భరించలేను  :D

ఒక  quotation  గుర్తొస్తుంది

"Communist until you get  rich, feminist until you get married, atheist until the plane starts falling " :P