29, డిసెంబర్ 2013, ఆదివారం

జుట్టుని కత్తికి ఇచ్చుకోవటం :D

డబ్బులు వదిలించుకుని  ఏడవటం అంటే ఇదేనేమో ... పిల్లిని చూసి నక్క వాత పెట్టుకుంది  అంటే ఏంటో అనుకున్నా కానీ  ఒకోసారి పిల్లి ఇంకో పిల్లిని చూసి వాత పెట్టుకున్నా జరిగేది ఒక్కటే ... కానీ పిల్లి తననే  చూసి మళ్లీ వాత పెట్టుకుంటే .. meow.... :D

 హిహి  నా confusion తో మిమ్మల్ని ఇంకా confuse చేస్తున్నా కదా .. :D

సరే అసలేం అయ్యిందంటే ...  హెయిర్  స్టైల్ చేయిస్దామని మా ఇంటి కిందనే ఉన్న ఒక పార్లర్  దగ్గరికి వెళ్ళా ,,, అదేదో Pinks n  Blues  అంట .. unisex salon  కి ఇంత క్రియేటివ్ గా పేరు పెట్టుకున్నారు అనుకున్నా ... కొత్త వాటి జోలికి అస్సలు వెళ్ళే అలవాటు లేని నేను ధైర్యం చేసి ఇంకో గతి లేక కిందనే ఉందని వెళ్లాను ...

జీవితం లో  కొన్ని ముఖ్యమయిన విషయాలు చిరాకులో ,కోపం లో  ఉన్నప్పుడు అస్సలు  తీసుకోకూడదు  అందులో ఒక  ముఖ్యమయిన విషయం  జుట్టుని  కత్తికి  ఇచ్చుకోవటం  :D

శుక్ర వారం  ఏంటి  అని పక్కన ఉన్న  కజిన్  వారించినా , ఇక్కడ శుక్రవారం ప్రపంచం లో  ఇంకో చోట ఎక్కడో గురువారం ,,, అయినా  రోజు బట్టి  జుట్టు పెరుగుతుందా అని దానికి కూడా  పిచ్చెక్కించి , నేను  లోపలికి వెళ్లాను

చిన్నప్పుడు  మా  పెద్దమ్మ  పౌర్ణమి ముందు కట్ చేయించుకుంటే  జుట్టు బాగా పెరుగుతుంది , అమావాస్య అయితే తొందరగా పెరగదు .. మళ్లీ దాన్లో  హస్త వాసి ,,, నా  జుట్టు  ఇన్ని factors consider చేస్తుందన్న విషయం నాకే వింతగా అనిపిస్తుంది ఇప్పుడు  .. అంటే  అప్పట్లో చిన్న పిల్లని కాబట్టి ఏం చెప్పినా  "అవునా ..  సరే "  అనేదానిని ... ఇప్పుడు కొంచెం తిక్క ఎక్కువయ్యి " అవునా .. ఏమవుతదో చూస్దాం :P " అన్న మాదిరి  తయ్యారివితిని



సరే ముందు చెప్పినట్టు కొత్త  hairstylist  అంటే  ఉన్న భయం , గౌరవం , ఏదో లే.... నాలో ఉన్న  ఒక రకమయిన భావన వల్ల నా పాత hair స్టైల్ ఫోటో  చూపించి ..  ఇలానే  చెయ్యి  అని ఒకటికి  పది సార్లు చెప్పి  ఉంటాను .. ఇప్పుడు ఆలోచిస్తే అర్ధం అవుతుంది  .. అది కూడా ఒకటికి పది సార్లు  కత్తి రించి పడేసి ఉంటుంది  :( :(

గంట  నా జుట్టు మీద ప్రయోగాలు చేసి ఓవల్  shape  కి  ఏదయినా బావుంటుంది అని సోది వేసి అర అంగుళం కట్ చెయ్యమంటే ఆరు అంగుళాలు కట్  చేసి ... క్యూట్  గా ఉన్నారని  ఒక compliment నా మోహాన నేను ఏడవ కూడని అని పాడేసి ఇంచు మించు వెయ్యికి దగ్గరలో బిల్లు వేసినా ఆ  పిల్లని , పిల్లోడిని ఏమనాలో  తెలియక వచ్చిన confusion  ఇంకా  తగ్గలేదు  :)

అందరూ డిఫరెంట్ అంటుంటే ..

అదే కదా నా బాధ .. నాలాగా నేను అనిపించట్లేదు  :(  :(

ఇప్పుడు తెలుగు  క్యాలెండరు చెక్ చేస్తున్నా అమావాస్య నా / పౌర్ణమా  అని  :P  ఈ  hairstyle  ఎక్కువ  రోజులు నేను  భరించలేను  :D

ఒక  quotation  గుర్తొస్తుంది

"Communist until you get  rich, feminist until you get married, atheist until the plane starts falling " :P